మెయిన్ ‘డ్రా’కు సోమ్‌దేవ్
మలేసియా ఓపెన్ టోర్నమెంట్‌లో భారత టెన్నిస్ స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. సోమవారం జరిగిన పురుషుల
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ టోర్నమెంట్‌లో భారత టెన్నిస్ స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్‌లో సోమ్‌దేవ్ 7-5, 7-5తో జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్)పై గెలుపొందాడు. మరోవైపు బ్యాంకాక్‌లో జరుగుతున్న థాయ్‌లాండ్ ఓపెన్‌లో భారత్‌కే చెందిన కరుణోదయ్ సింగ్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్‌లో 6-4, 1-6, 4-6తో మార్కో చియుడినెల్లి (స్విట్జర్లాండ్) చేతిలో ఓడిపోయాడు.
మళ్లీ టాప్-100లోకి
19 నెలల తర్వాత సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ మళ్లీ టాప్-100 ర్యాంకింగ్స్‌లోకి వచ్చాడు. యూఎస్ ఓపెన్‌లో రెండో రౌండ్‌లో ఓడిన ఈ భారత స్టార్ సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో 98వ స్థానానికి ఎగబాకాడు. చైనీస్ తైపీ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన యూకీ బాంబ్రీ ఏకంగా 190 స్థానాలు పురోగతి సాధించి 287వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.