
Syed Modi International 300 Tournament: సయ్యద్ మోదీ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ పీవీ సింధు, తెలంగాణ అమ్మాయి సామియా ఇమాద్ ఫారూఖీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి సింధు 33 నిమిషాల్లో 21–16, 21–13తో లారెన్ లామ్ (అమెరికా)పై... సామియా 27 నిమిషాల్లో 21–6, 21–15తో కనిక (భారత్)పై గెలిచారు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు 9–21, 6–21తో ఆకర్షి కశ్యప్ (భారత్) చేతిలో ఓడిపోయింది.
పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గారగ కృష్ణ ప్రసాద్ జోడీ 15–21, 21–17, 21–8తో అయూబ్–లిమ్ కిమ్ వా (మలేసియా) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో గాయత్రి గోపీచంద్–త్రిషా జాలీ ద్వయం 21–12, 21–7తో సిమ్రన్– రితికా జంటపై నెగ్గి క్వార్టర్ ఫైనల్ చేరింది.
చదవండి: Australian Open 2022: యూఎస్ ఓపెన్ చాంపియన్ ఎమ్మా రాడుకానుకు దిమ్మతిరిగే షాక్
Comments
Please login to add a commentAdd a comment