ఆట ఏదైనా సెలబ్రేషన్స్ చేసుకోవడం సహజం. అయితే ఆ సెలబ్రేషన్స్ కాస్త కొత్తగా అనిపిస్తే వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా ఈజిప్ట్ స్టార్ ఫుట్‌బాలర్ మహ్మద్ సాలా.. సహచర ఆటగాడు ట్రెజెగ్యుట్ మధ్య జరిగిన సెలబ్రేషన్ మూమెంట్ నిమిషాల వ్యవధిలో వైరల్ అయింది. సాధారణంగా సాకర్ గేమ్ చూసేవారికి షూ పాలిష్ సెలబ్రేషన్ తెలిసే ఉంటుంది. ఇలాంటివి ఎక్కువగా ఫిఫా వరల్డ్‌కప్‌లో ఎక్కువగా చూస్తుంటాం. తాజాగా ఆఫ్రికన్ కప్ ఆఫ్ నేషన్స్‌లో(ఆఫ్‌కాన్) అలాంటి సెలబ్రేషన్స్‌తో మెరిశారు.. మహ్మద్ సాలా, ట్రెజెగ్యుట్.
చదవండి: Mason Greenwood: ఫుట్‌బాల్ ఆటగాడి మెడకు బిగుస్తున్న ఉచ్చు.. ఇక కష్టమే
ఆఫ్‌కాన్ లీగ్‌లో భాగంగా ఈజిప్ట్, మొరాకొల మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. అయితే మ్యాచ్ నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరుజట్లు 1-1తో సమానంగా నిలిచాయి. దీంతో అంపైర్లు ఎక్స్‌ట్రా టైమ్‌కు(30 నిమిషషాలు) అవకాశం ఇచ్చారు. ఫెనాల్టీ షూటౌట్‌లో మహ్మద్ సాలా మెరుపువేగంతో బంతిని పాస్ చేయగా.. ట్రెజెగ్యుట్ దానిని సూపర్ గోల్‌గా మలిచాడు. ఇంకేముంది 2-1 ఆధిక్యంతో ఈజిప్ట్ సెమీస్‌లో అడుగుపెట్టింది. ఈజిప్ట్ విజయంలో కీలకపాత్ర పోషించిన మహ్మద్ సాలా, ట్రెజెగ్యుట్‌లు ఒకరినొకరు అభినందించుకున్నారు. ఆ తర్వాత ట్రెజెగ్యుట్ మొకాళ్లపై నిలబడి.. సాలా షూ పాలిష్ చేస్తున్నట్లుగా స్టిల్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోపై లుక్కేయండి.
ఇక అంతకముందు మొరాకో తరపున ఆట 7వ నిమిషంలో సోఫియాన్ బౌఫాల్ గోల్‌తో మెరిసి జట్టుకు శుభారంభం అందించాడు. అయితే ఫస్ట్ ఆఫ్‌లో గోల్ చేయడంలో విఫలమైన ఈజిప్ట్.. రెండో అర్థభాగంలో మెరిసింది. ఆట 53వ నిమిషంలో మహ్మద్ సాలా గోల్‌తో మెరవడంతో స్కోరు 1-1తో సమమైంది. ఆ తర్వాత నిర్ణీత సమయంలో రెండు జట్లు గోల్ కొట్టకపోవంతో ఎక్స్‌ట్రా టైమ్ ఇచ్చారు. దీనికి ఈజిప్ట్ చక్కగా వినియోగించుకుంది. ఇక సెమీస్‌లో అడుగుపెట్టిన ఈజిప్ట్‌తో కామెరున్‌తో ఫిబ్రవరి 4న అమితుమీ తేల్చుకోనుంది. మరో సెమీస్‌లో బుర్కినా ఫాసో, సెనెగల్‌లు తలపడనున్నాయి.
చదవండి: Andre Russell: ప్రాక్టీస్ సమయంలో వింత అనుభవం.. మళ్లీ బుక్కైన రసెల్
— . (@dontinterac) January 31, 2022
Comments
Please login to add a commentAdd a comment