సౌదీ స్మాష్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ మనిక బత్రా పోరాటం ముగిసింది. బుధవారం జెద్దాలో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 39వ ర్యాంకర్ మనిక 11–7, 6–11, 4–11, 11–13, 2–11తో ప్రపంచ ఐదో ర్యాంకర్ హినా హయాటా (జపాన్) చేతిలో ఓడిపోయింది. మనిక బత్రాకు 17,000 డాలర్ల (రూ. 14 లక్షల 18 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment