గెలుపే లక్ష్యంగా ... | target win | Sakshi
Sakshi News home page

గెలుపే లక్ష్యంగా ...

Published Fri, Sep 23 2016 9:56 PM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM

గెలుపే లక్ష్యంగా ...

గెలుపే లక్ష్యంగా ...

  • సాగిన క్వార్టర్‌ ఫైనల్స్‌ 
  • సెమీస్‌కు చేరిన రాష్ట్రస్థాయి షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు
  • కొత్తపేట : 
    రాష్ట్రస్థాయి అండర్‌–19 షటిల్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ షిప్‌ –2016 పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన వారు జాతీయ పోటీలకు ఎంపిక కానుండడంతో క్రీడాకారులు గెలుపే లక్ష్యంగా తలపడుతున్నారు. కొత్తపేట రెడ్డి అనసూయమ్మ మెమోరియల్‌ ఇండోర్‌ స్టేడియంలో షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు తుది దశకు చేరాయి. శనివారం సెమీఫైనల్, ఫైనల్‌ పోటీలు జరగనున్నాయి. శుక్రవారం క్వార్టర్‌ ఫైనల్‌ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో విజేతగా నిలిచిన పలువురు సెమీస్‌కు అర్హత సాధించారు. బాలికల సింగిల్స్‌ విభాగంలో అక్షిత(తూర్పుగోదావరి), సబీనా బేగమ్‌ (కర్నూలు), ప్రీతికా(విజయనగరం), నిషితా వర్మ (విశాఖపట్నం), బాలుర విభాగంలో జశ్వంత్‌ (చిత్తూరు), దత్తాత్రేయ రెడ్డి(కడప), ప్రణయ్‌(వైజాగ్‌), వేదవ్యాస్‌ (ప్రకాశం) సెమీ ఫైనల్స్‌కు చేరారు. 
    డబుల్స్‌ విభాగంలో..
    బాలికల డబుల్స్‌ విభాగంలో అక్షిత(తూర్పుగోదావరి), ప్రీతి (విజయనగరం) జంట, నివేదిత, లక్ష్మి (విశాఖపట్నం) జంట, నవ్యసరూప, శన్విత (తూర్పు గోదావరి), అసియా, షబ్నాబేగం (కర్నూలు)జోడీ సెమీస్‌కు చేరింది. బాలుర డబుల్స్‌ విభాగంలో డి.నితిన్‌ (తూర్పు గోదావరి), డి.హరికృష్ణ (పశ్చిమ గోదావరి) జంట, బషీర్, గౌస్‌ (నెల్లూరు), సాయికిషోర్‌ (పశ్చిమ గోదావరి), సాయి కిరణ్‌ (విశాఖపట్నం) జంటలు సెమీస్‌కు చేరాయి.
     
    క్వార్టర్‌ ఫైనల్స్‌లో సత్తా..
    క్వార్టర్‌ ఫైనల్స్‌లో పలువురు తమ ప్రతిభ చాటారు. ముఖ్యంగా బాలుర సింగిల్స్‌ విభాగంలో ఆర్‌.ప్రణవ్, పి.చంద్రపట్నాయక్‌ (విశాఖపట్నం)పై విజయం సాధించాడు. బాలుర డబుల్స్‌ విభాగంలో సాయికిషోర్‌ (పశ్చిమ గోదావరి), సాయి కిరణ్‌ (విశాఖపట్నం)జోడీ కేఆర్‌కే షరీఫ్, ప్రవీణ్‌ (విశాఖపట్నం)లు 21–16, 25–23 తేడాతో విజయం సాధించారు. ఈ రెండు మ్యాచ్‌లు ఉత్కంఠ భరితంగా సాగాయి.
     
    ఈ పోటీలు గ్రామీణ క్రీడాకారులకు స్ఫూర్తి
    గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి టోర్నమెంట్స్‌ ఈ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించినట్టు ఉం టుంది. ఇక్కడికి వచ్చే స్టేట్, నేషనల్‌ షటిల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల ప్రతిభను తిలకించి తామూ వారిలా తయారు కావాలనే కోరిక కలుగుతుం ది. అంతే కాక ఈ ప్రాంతానికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభిస్తుంది.
    – ఎస్‌ సూరిబాబు, రిఫరీ, ఏపీబీటీఓ ప్రెసిడెంట్, శ్రీకాకుళం
     
    జాతీయ స్థాయిలో టోర్నీ ఏర్పాట్లు
    ఇంతవరకూ ఎక్కడా లేని విధంగా జాతీయ స్థాయిలో పోటీలకు ఏర్పాట్లు చేశారు. నిర్వాహకులు క్రీడాకారులు, కోచ్‌లను మర్యాద పూర్వకంగా చూసుకుంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి ఈ టోర్నమెంట్‌ వేదిక. దీనిని కొత్తపేటలో నిర్వహించడం ఈ ప్రాంతానికే గర్వకారణం.
    డాక్టర్‌ కె రమేష్, రిఫరీ, ఏపీబీటీఓ సెక్రటరీ, ప్రకాశం జిల్లా
     
    ఒలింపిక్స్‌ విన్నర్‌ కావడమే లక్ష్యం
    గోపీచంద్‌ అకాడమీలో మూడున్నరేళ్లుగా శిక్షణ పొందుతూ గత ఏడాది అండర్‌ 17,19 స్టేట్‌ విన్నర్‌గా నిలిచాను. షటిల్‌ బ్యాడ్మిం టన్‌లో ఇండియా తరఫున అంతర్జాతీయ పోటీ ల్లో పాల్గొన్న మొదటి ఉమెన్, గోపీచంద్‌ సతీమణి పీవీ లక్ష్మి స్ఫూర్తితో ఆడుతున్నా. ఒలింపిక్స్‌ విన్నర్‌ కావాలన్నదే నా లక్ష్యం. ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగున్నాయి.          ఎ అక్షిత, క్రీడాకారిణి, రాజమహేంద్రవరం
     
    ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధిస్తా..
    గోపీచంద్‌ అకాడమీలో శిక్షణ పొందుతూ రెండు సార్లు నేషనల్స్‌ విన్నర్‌గా నిలిచాను. షటిల్‌ బ్యాడ్మింటన్‌ అంతర్జాతీయ క్రీడాకారుడు కె శ్రీకాంత్‌ స్ఫూర్తితో ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సా ధిస్తాననే నమ్మకంతో ఆడుతున్నా. నేషనల్‌ స్థాయి లో ఇక్కడ ఏర్పాట్లు చేశారు. 
    దండు యశ్వంత్, క్రీడాకారుడు, చిత్తూరు జిల్లా 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement