సొంతగడ్డపై తమ విజయపరంపర కొనసాగిస్తూ భారత మహిళల జట్టు హాకీ వరల్డ్ లీగ్ రౌండ్-2లో వరుసగా మూడో విజయాన్ని సాధించింది.
మహిళల హాకీ వరల్డ్ లీగ్
న్యూఢిల్లీ: సొంతగడ్డపై తమ విజయపరంపర కొనసాగిస్తూ భారత మహిళల జట్టు హాకీ వరల్డ్ లీగ్ రౌండ్-2లో వరుసగా మూడో విజయాన్ని సాధించింది. థాయ్‌లాండ్‌తో మంగళవారం జరిగిన చివరిదైన మూడో లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 6-0 గోల్స్ తేడాతో గెలిచింది.
తద్వారా గ్రూప్ ‘ఎ’లో తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకొని క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. భారత్ తరఫున అమన్‌దీప్ కౌర్ (25వ ని.లో), వందన కటారియా (45వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... రాణి రాంపాల్ (40, 60వ ని.లో), జస్‌ప్రీత్ కౌర్ (38, 60వ ని.లో), రెండేసి గోల్స్ సాధించారు. గురువారం జరిగే క్వార్టర్ ఫైనల్లో సింగపూర్‌తో భారత్ తలపడుతుంది.