క్వార్టర్స్‌లో యూకీ | Chennai Open: Yuki Bhambri enters quarters after Fabio Fognini concedes match | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో యూకీ

Published Fri, Jan 3 2014 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM

యూకీ

యూకీ

చెన్నై: భారత యువ కెరటం యూకీ బాంబ్రీ... చెన్నై ఓపెన్ టోర్నీలో సత్తా చాటుకున్నాడు. తన కెరీర్‌లో పెద్ద విజయాన్ని నమోదు చేసి క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో ప్రపంచ 16వ ర్యాంకర్ ఫ్యాబియో ఫోగ్నిని (ఇటలీ)తో జరిగిన మ్యాచ్‌లో... 195వ ర్యాంకర్ యూకీ 6-1, 5-5 ఆధిక్యంలో ఉన్న సమయంలో ప్రత్యర్థి కాలి గాయం కారణంగా తప్పుకున్నాడు.
 
 
 దీంతో చెన్నై ఓపెన్‌లో క్వార్టర్‌ఫైనల్ చేరిన మూడో భారత ఆటగాడిగా యూకీ రికార్డులకెక్కాడు. 2009 టోర్నీలో సోమ్‌దేవ్ రన్నరప్‌గా నిలవగా, 1998 ఈవెంట్‌లో లియాండర్ పేస్ సెమీస్ దాకా వెళ్లాడు. గంటా ఆరు నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో... తొలిసెట్ నాలుగో గేమ్‌లో ఫోగ్నిని సర్వీస్ బ్రేక్ చేసిన యూకీ 3-1 ఆధిక్యంలో నిలిచాడు. అయితే తర్వాతి గేమ్‌లో రెండు బ్రేక్ పాయింట్ల కోసం హోరాహోరీగా తలపడి నెగ్గాడు.
 
 ఏడో గేమ్‌లో సర్వీస్‌ను నిలబెట్టుకుని సెట్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్ ఐదో గేమ్‌లో బ్రేక్ పాయింట్ సాధించినా... తర్వాతి గేమ్‌ను చేజార్చుకోవడంతో స్కోరు 5-5తో సమమైంది. క్వాలిఫయర్‌గా బరిలోకి దిగిన 19 ఏళ్ల రామ్ కుమార్ రామనాథన్ 2-6, 4-6తో గ్రానోలెర్స్ (స్పెయిన్) చేతిలో ఓడాడు. మరో మ్యాచ్‌లో పెయిరీ (ఫ్రాన్స్) 6-1, 6-4తో  లోపెజ్ (స్పెయిన్)పై గెలిచాడు. డబుల్స్ క్వార్టర్స్‌లో పురవ్ రాజా- సీలా (ఇజ్రాయెల్) 4-6, 4-6తో స్టామ్ (స్వీడన్)-నీల్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement