chennai open tournment
-
చెన్నై ఓపెన్ చాంపియన్ సుమిత్ నగాల్
భారత టెన్నిస్ నంబర్‌వన్ సుమిత్ నగాల్ స్వదేశంలో తొలిసారి ఏటీపీ చాలెంజర్ టోర్నీ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం ముగిసిన చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టోర్నీలో సుమిత్ విజేతగా నిలిచాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 121వ ర్యాంకర్ సుమిత్ 6–1, 6–4తో 114వ ర్యాంకర్ లుకా నార్డీ (ఇటలీ)పై గెలిచి తన కెరీర్లో నాలుగో ఏటీపీ చాలెంజర్ టోర్నీ టైటిల్ సాధించాడు. విజేతగా నిలిచిన సుమిత్‌కు 18,230 డాలర్ల (రూ. 15 లక్షల 13 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 100 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
భారత నంబర్‌వన్‌గా కర్మన్ కౌర్
ఐదేళ్ల తర్వాత భారత మహిళల టెన్నిస్ సింగిల్స్‌లో నంబర్‌వన్‌గా కొత్త క్రీడాకారిణి వచ్చింది. 2017 నుంచి భారత టాప్ ర్యాంకర్‌గా కొనసాగుతున్న అంకితా రైనా సోమవారం విడుదల చేసిన సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి పడిపోయింది. చెన్నై ఓపెన్ లో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరిన కర్మన్ కౌర్ భారత కొత్త నంబర్‌వన్‌గా అవతరించింది. కర్మన్ 37 స్థానాలు ఎగబాకి 322వ ర్యాంక్‌కు చేరగా... చెన్నై ఓపెన్‌లో తొలి రౌండ్లోనే ఓడిన అంకిత నాలుగు స్థానాలు పడిపోయి 329వ ర్యాంక్‌లో నిలిచింది. -
క్వార్టర్స్‌లో యూకీ
చెన్నై: భారత యువ కెరటం యూకీ బాంబ్రీ... చెన్నై ఓపెన్ టోర్నీలో సత్తా చాటుకున్నాడు. తన కెరీర్లో పెద్ద విజయాన్ని నమోదు చేసి క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 16వ ర్యాంకర్ ఫ్యాబియో ఫోగ్నిని (ఇటలీ)తో జరిగిన మ్యాచ్‌లో... 195వ ర్యాంకర్ యూకీ 6-1, 5-5 ఆధిక్యంలో ఉన్న సమయంలో ప్రత్యర్థి కాలి గాయం కారణంగా తప్పుకున్నాడు. దీంతో చెన్నై ఓపెన్‌లో క్వార్టర్‌ఫైనల్ చేరిన మూడో భారత ఆటగాడిగా యూకీ రికార్డులకెక్కాడు. 2009 టోర్నీలో సోమ్‌దేవ్ రన్నరప్‌గా నిలవగా, 1998 ఈవెంట్లో లియాండర్ పేస్ సెమీస్ దాకా వెళ్లాడు. గంటా ఆరు నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో... తొలిసెట్ నాలుగో గేమ్‌లో ఫోగ్నిని సర్వీస్ బ్రేక్ చేసిన యూకీ 3-1 ఆధిక్యంలో నిలిచాడు. అయితే తర్వాతి గేమ్‌లో రెండు బ్రేక్ పాయింట్ల కోసం హోరాహోరీగా తలపడి నెగ్గాడు. ఏడో గేమ్‌లో సర్వీస్‌ను నిలబెట్టుకుని సెట్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్ ఐదో గేమ్‌లో బ్రేక్ పాయింట్ సాధించినా... తర్వాతి గేమ్‌ను చేజార్చుకోవడంతో స్కోరు 5-5తో సమమైంది. క్వాలిఫయర్‌గా బరిలోకి దిగిన 19 ఏళ్ల రామ్ కుమార్ రామనాథన్ 2-6, 4-6తో గ్రానోలెర్స్ (స్పెయిన్) చేతిలో ఓడాడు. మరో మ్యాచ్‌లో పెయిరీ (ఫ్రాన్స్) 6-1, 6-4తో లోపెజ్ (స్పెయిన్)పై గెలిచాడు. డబుల్స్ క్వార్టర్స్‌లో పురవ్ రాజా- సీలా (ఇజ్రాయెల్) 4-6, 4-6తో స్టామ్ (స్వీడన్)-నీల్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడారు.