లండన్: కెరీర్‌లో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించే దిశగా సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మరో అడుగు వేశాడు. ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోరీ్నలో ఈ సెర్బియా స్టార్ 14వసారి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. తొలి మూడు రౌండ్ మ్యాచ్‌ల్లో రెండున్నర గంటల్లోపే విజయాన్ని అందుకున్న జొకోవిచ్‌కు ప్రిక్వార్టర్ ఫైనల్లో మాత్రం అంత సులువుగా గెలుపు దక్కలేదు. 2021 సెమీఫైనలిస్ట్, ప్రపంచ 18వ ర్యాంకర్ హుబెర్ట్ హుర్కాజ్ (పోలాండ్)తో జరిగిన మ్యాచ్‌లో రెండో సీడ్ జొకోవిచ్ 7–6 (8/6), 7–6 (8/6), 5–7, 6–4తో నెగ్గి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు.
3 గంటల 7 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ 18 ఏస్‌లు సంధించగా, హుర్కాజ్ 33 ఏస్‌లతో అదరగొట్టాడు. తొలి సెట్‌లో జొకోవిచ్ మూడుసార్లు సెట్ పాయింట్లను, రెండో సెట్‌లో రెండుసార్లు సెట్ పాయింట్లను కాపాడుకోవడం గమనార్హం. ఈ మ్యాచ్ ఆదివారం, సోమవారం రెండు రోజులపాటు జరిగింది. టోర్నీ నిబంధనల ప్రకారం రాత్రి 11 గంటల వరకే ఆటను కొనసాగించాలి. ఆదివారం రెండు సెట్‌లు ముగిసిన తర్వాత మ్యాచ్‌ను సోమవారానికి వాయిదా వేశారు.
సోమవారం ఆటను కొనసాగించగా... మూడో సెట్‌ను హుర్కాజ్ గెల్చుకున్నాడు. అయితే నాలుగో సెట్‌లో జొకోవిచ్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాడు. ఏడో గేమ్‌లో హుర్కాజ్ సర్విస్‌ను బ్రేక్ చేసి ఎనిమిదో గేమ్‌లో తన సర్విస్‌ను కాపాడుకొని 5–3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అనంతరం పదో గేమ్‌లో జొకోవిచ్ తన సర్విస్‌ను కాపాడుకొని సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. వింబుల్డన్ టోర్నీ చరిత్రలో జొకోవిచ్‌కిది 90వ విజయం కావడం విశేషం.
మరోవైపు ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) కథ ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో అమెరికా ప్లేయర్ క్రిస్టోఫర్ యుబ్యాంక్స్ 3–6, 7–6 (7/4), 3–6, 6–4, 6–4తో సిట్సిపాస్‌ను ఓడించి తన కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరాడు. జిరీ లెహెస్కా (చెక్ రిపబ్లిక్)తో జరిగిన మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) 6–4, 6–2తో తొలి రెండు సెట్‌లు గెల్చుకున్నాడు.
అనంతరం లెహెస్కా గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలడంతో మెద్వెదెవ్‌కు క్వార్టర్ ఫైనల్ బెర్త్ దక్కింది. మూడో రౌండ్‌లో బోపన్న జోడీ పురుషుల డబుల్స్ రెండో రౌండ్‌లో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) ద్వయం 7–5, 6–3తో జేకబ్ ఫియరెన్లీ–జోనస్ మండే (బ్రిటన్) జోడీపై నెగ్గి మూడో రౌండ్‌కు చేరుకుంది.
ఓటమి అంచుల నుంచి...
మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) ఓటమి అంచుల నుంచి గట్టెక్కి తొలిసారి ఈ టోరీ్నలో క్వార్టర్ ఫైనల్ చేరింది. 14వ సీడ్ బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్ 6–7 (4/7), 7–6 (7/2), 6–3తో గెలిచింది. రెండో సెట్‌లో స్కోరు 5–6 వద్ద స్వియాటెక్ తన సర్విస్‌లో రెండు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని స్కోరును 6–6తో సమం చేసింది. టైబ్రేక్‌లో సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచిన ఆమె మూడో సెట్‌లోని నాలుగో గేమ్‌లో బెన్‌చిచ్ సర్విస్‌ను బ్రేక్ చేసి ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకొని గెలిచింది.
ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో స్వితోలినా (ఉక్రెయిన్) 2–6, 6–4, 7–6 (11/9)తో మాజీ నంబర్‌వన్ అజరెంకా (బెలారస్)పై, రెండో సీడ్ సబలెంకా (బెలారస్) 6–4, 6–0తో ఎకతెరీనా అలెగ్జాండ్రోవా (రష్యా)పై, ఆరో సీడ్ ఆన్స్ జబర్ (ట్యునిíÙయా) 6–0, 6–3తో రెండుసార్లు చాంపియన్ క్విటోవా (చెక్ రిపబ్లిక్)పై, మాడిసన్ కీస్ 3–6, 7–6 (7/4), 6–2తో మిరా ఆండ్రీవా (రష్యా)పై గెలిచారు. డిఫెండింగ్ చాంపియన్ రిబాకినా (కజకిస్తాన్) తొలి సెట్‌లో 4–1తో ఆధిక్యంలో ఉన్నపుడు ఆమె ప్రత్యర్థి బీట్రిజ్ హదద్ మయా (బ్రెజిల్) గాయం కారణంగా వైదొలిగింది.
Comments
Please login to add a commentAdd a comment