
PV Sindhu Enters Quarterfinals Indonesia Open Super 1000.. ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలుగుతేజం పీవీ సింధు క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. టోర్నీలో మూడోసీడ్‌గా బరిలోకి దిగిన సింధు గురువారం జరిగిన రెండో రౌండ్‌లో జర్మనీకి చెందిన బాలిలో వైవోన్ లీని 21-12, 21-18తో వరుస సెట్లలో ఓడించింది. రెండుసార్లు ఒలింపిక్ విజేత అయిన సింధు వైవోన్ లీని కేవలం 37 నిమిషాల్లోనే మట్టికరిపించి క్వార్టర్స్‌కు చేరుకుంది. ఇక క్వార్టర్స్‌లో స్పెయిన్‌కు చెందిన 55వ సీడ్ బీట్రిజ్ కొర్రల్స్, కొరియాకు చెందిన 54వ సీడ్ సిమ్ యుజిన్ మధ్య విజేతతో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment