చాంగ్జౌ: చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్‌లో భారత్ పోరాటం ముగిసింది. మహిళల విభాగంలో ముందంజ వేసిన ఏకైక భారత ఆశాకిరణం మాళవిక బన్సోద్‌కు క్వార్టర్ ఫైనల్లో చుక్కెదురైంది. జపాన్ స్టార్, నాలుగో సీడ్ అకానె యామగుచి ధాటికి మాళవిక నిలువలేకపోయింది.
శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మాళవిక 10–21, 16–21తో ప్రపంచ ఐదో ర్యాంకర్ యామగుచి జోరుకు వరుస గేమ్‌లలో ఓడిపోయింది. బన్సోద్‌పై యామగుచికి వరుసగా ఇది మూడో విజయం కావడం గమనార్హం.ఈ టో ర్నీలో మిగతా భారత షట్లర్లు ఇదివరకే నిష్క్రమించారు.
పురుషుల సింగిల్స్‌లో కిరణ్ జార్జ్, ప్రియాన్షు రజావత్, మహిళల ఈవెంట్‌లో ఆకర్శి కశ్యప్, సామియా ఇమాద్‌లు తొలి రౌండ్ పోటీల్లోనే ఇంటిదారి పట్టారు. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ, మిక్స్‌డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి–సుమిత్ జోడీలు కూడా తొలి రౌండ్ అడ్డంకిని దాటలేకపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment