తొలి సెట్ కోల్పోయినా... వెంటనే తేరుకున్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు షేక్ అబ్దుల్లా జాతీయ జూనియర్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.
చెన్నై: తొలి సెట్ కోల్పోయినా... వెంటనే తేరుకున్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు షేక్ అబ్దుల్లా జాతీయ జూనియర్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన జూనియర్ బాలుర సింగిల్స్ మూడో రౌండ్‌లో టాప్ సీడ్ అబ్దుల్లా 1-6, 6-4, 7-5తో 13వ సీడ్ బాసిల్ ఖుమా (మిజోరం)పై శ్రమించి గెలిచాడు.
ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో అడవెల్లి పార్థసారథి (ఆంధ్రప్రదేశ్) 6-3, 6-2తో మహ్మద్ ఫహాద్ (తమిళనాడు)పై నెగ్గగా... వెంకట జ్ఞానభాస్కర్ (ఆంధ్రప్రదేశ్) 3-6, 6-4, 1-6తో నితిన్ కుమార్ సిన్హా (పశ్చిమ బెంగాల్) చేతిలో ఓడిపోయాడు. బాలికల సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నయనిక రెడ్డి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మూడో రౌండ్‌లో నయనిక 6-2, 6-0తో గాయత్రి (చండీగఢ్)పై గెలుపొందింది.