
ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత పురుషల ఆర్చరీ జట్టు కూడా శుభారంభం చేసింది. గురువారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో భారత అర్చర్లు అదరగొట్టారు. టీమ్ ఈవెంట్‌లో ధీరజ్ బొమ్మదేవర, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్‌తో కూడిన భారత జట్టు క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది.
క్వాలిఫికేషన్ రౌండ్‌లో 2,013 పాయింట్లతో మూడో స్ధానంలో నిలిచిన భారత జట్టు.. నేరుగా క్వార్టర్స్‌కు ఆర్హత సాధించింది. భారత బృందంలో ధీరజ్ బొమ్మదేవర 681 పాయింట్లతో 4వ స్ధానంలో నిలవగా.. తరుణ్‌దీప్ రాయ్(674), ప్రవీణ్ జాదవ్(658)లు వరుసగా 14, 39వ స్ధానాల్లో నిలిచారు.
మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు నేరుగా ఫైనల్స్‌కు చేరుకుంటాయి. 5 నుంచి 12 స్థానాల్లో నిలిచిన టీమ్‌లు రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లు ఆడతాయి. కాగా ఇప్పటికే అంకితా భకత్, భజన్ కౌర్, దీపికా కుమారి త్రయంతో కూడిన భారత మహిళ ఆర్చరీ జట్టు క్వార్టర్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment