Olympics 2024: వరల్డ్‌ నంబర్‌ వన్‌కు షాకిచ్చిన వినేశ్‌ | Paris Olympics 2024: Vinesh Phogat Beats Tokyo Olympics Gold Medalist Yui Susaki In Round 16, See Details | Sakshi
Sakshi News home page

వరల్డ్‌ నంబర్‌ వన్‌కు షాకిచ్చిన వినేశ్‌.. సంచలన విజయం

Published Tue, Aug 6 2024 3:36 PM | Last Updated on Tue, Aug 6 2024 5:03 PM

Olympics 2024: Vinesh Phogat Beats Tokyo Olympics GOLD Medalist Round 16

ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024లో ఊహించని పరిణామం!!!.. వరల్డ్‌ నంబర్‌ 65 ర్యాంకర్‌.. వరల్డ్‌ నంబర్‌ వన్‌ ప్లేయర్‌ను మట్టికరిపించిన వైనం!!!. ఊహించని రీతిలో ప్రత్యర్థిని దెబ్బకొట్టి పతక రేసులో నిలిచిన అపూర్వ తరుణం. ఈ సంచలనం సృష్టించింది మరెవరో కాదు.. మన రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌.

అవును... భారత మహిళా రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ చారిత్రాత్మక విజయం సాధించింది. వుమెన్స్‌ 50 కేజీల ఫ్రీ స్టయిల్‌ విభాగంలో ప్రి క్వార్టర్స్‌లో వరల్డ్ నంబర్‌ వన్‌, టోక్యో ఒలింపిక్స్‌ పసిడి పతక విజేత యీ సుసాకీని 3-2తో ఓడించింది.

జపాన్‌ రెజ్లర్‌పై పైచేయి సాధించి సగర్వంగా క్వార్టర్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. తదుపరి క్వార్టర్స్‌లో ఉక్రెయిన్‌కు చెందిన ఎనిమిదో సీడ్‌ ఒక్సానా లివాచ్‌తో వినేశ్‌ తలపడనుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement