
కెమారూన్‌లోని ఒలెంబే ఫుట్‌బాల్ మైదానంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన 8 మంది మృత్యువాత పడగా, మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ టోర్నీలో భాగంగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్ సందర్భంగా స్టేడియం వద్ద జరిగిన తొక్కసలాటలో వీరంతా ప్రాణాలు కోల్పోయారు. సామర్ధ్యానికి మించి ప్రేక్షకులను అనుమతించడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ సంఘటనపై ఆఫ్రికన్ ఫుట్‌బాల్ సమాఖ్య దర్యాప్తునకు ఆదేశించింది.
చదవండి: PSL 2022: పాకిస్థాన్ సూపర్ లీగ్‌పై కరోనా పంజా..