స్టేడియంలో తొక్కిసలాట:తీవ్ర విషాదం
లువాండా: అంగోలాలో ఓ ఫుట్ బాల్ స్టేడియంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉత్తర అంగోలా లో ఒక స్టేడియంలో శుక్రవారం జరిగిన తొక్కిసలాటలో 17 మంది ఫుట్ బాల్ అభిమానులు మరణించారు. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అంగోలీ దేశీయలీగ్‌లో జరుగుతున్న ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తత విషాదానికి దారి తీసింది. అంగోలా ఫుట్బాల్ చరిత్రలోనే ఇది తీరని విషాదమని అధికారులు చెబుతున్నారు.
ఈ ఘటపై అంగోలా అధ్యక్షుడు జోస్ ఎడ్వర్డో డాస్ శాంటోస్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన సాయం అందించాలని అ ధికారులు ఆదేశాలు జారీచేశారు. ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు.
భయం అంగోలా దేశీయ లీగ్ సీజన్ లో శాంతా రీటా డి కాసియా మరియు రిక్రేయేటివో డి లిబోలో మధ్య జరుగుతున్న మ్యాచ్ సందర‍్భంగా ప్రేక్షకుల తాకిడి భారీగా పెరిగింది. ఒక్కసారిగా జనం ఎగబడటంతో జనవరి 4 స్టేడియం ప్రవేశద్వారం వద్ద తోపులాట చోటు చేసుకుంది. 17మంది చనిపోయారనీ, పోలీసు ప్రతినిధి ఓర్లాండో బెర్నార్డో చెప్పారు. చనిపోయిన వారిలో పిల్లలు ఎంతమంది ఉన్నారో తెలియదని తెలిపారు. గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు.
కాగా ఫుట్‌బాల్ స్టేడియంలో తొక్కిసలాటలు, మరణాలుకు సంబంధించి ఫుట్ బాల్ క్రీడది విషాద చరిత్ర అనే చెప్పాలి. 2010 ప్రపంచ కప్ ముందు ఆతిథ్య ఐవరీ కోస్ట్, మాలావి మధ్య క్వాలిఫైయర్ మ్యాచ్ సందర్భంగా జరిగిన స్టాంపీడ్‌లో అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. విపరీతమైన రద్దీ కారణంగా జరిగిన ఈ తొక్కిసలాటలో ముందు 19 మృతి చెందారు. 2001లో ఘనాలో అక్ర స్పోర్ట్స్ స్టేడియంలో జరిగిన దుర్ఘటనలో మరో 127మంది మరణించారు. ఓడిపోయిన జట్టు అభిమానులు రెచ్చిపోయి గలాటా సృష్టించడంతో ఉద్రిక్తత రాజుకుంది. ఈ సమయంలో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడం తొక్కిసలాటకు దారితీసింది. ముఖ‍్యంగా 1964లో లిమా నేషనల్ స్టేడియంలో పెరూ-అర్జెంటీనా మ్యాచ్ తొక్కిసలాట సమయంలో320 మంది మరణించారు. సుమారు వెయ్యిమందికి పైగా గాయపడ్డారు. తప్పించుకునే వీలులేక చాలామంది కాళ్లకింద నలిగిపోయి ఊపిరాడక నిస్పహాయంగా ఫుట్‌బాల్ అభిమానులు ప్రాణాలు కోల్పోవడం మాయని మచ్చగా మిలిగిపోయింది. ఫిఫా వరల్డ్ ర్యాంకింగ్స్‌లో అంగోలాది 148 ర్యాంకు.