
యాండే : కామెరూన్‌లోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న శాంక్చు గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న బస్సును అక్రమంగా ఆయిల్ తరలిస్తున్న ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 53 మంది మరణించారని, మరో 21 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ట్రక్కులోని ఆయిల్ బస్సుపై పడగా, ప్రమాదం కారణంగా పుట్టిన నిప్పు బస్సును దహించివేసింది. బస్సు డ్రైవర్ ప్రమాదం నుంచి బయటపడగా అతన్ని అరెస్టు చేసే పనిలో పోలీసులు ఉన్నారు. ప్రమాదంలో మరణించిన వారి శరీరాలు తీవ్రంగా కాలి పోయాయని, గుర్తించడం కూడా కష్టంగా ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
చదవండి : అన్న ప్రియురాలిపై కన్ను.. వీడియోలతో..


Comments
Please login to add a commentAdd a comment