మెయిన్ ‘డ్రా’కు సిరిల్, పూజ | main draw siril,pooja | Sakshi
Sakshi News home page

మెయిన్ ‘డ్రా’కు సిరిల్, పూజ

Published Thu, Feb 6 2014 12:16 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

main draw siril,pooja

సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు సిరిల్ వర్మ, ఎం.కనిష్క్, డి.పూజ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు.
 
 బెంగళూరులో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన పురుషుల క్వాలిఫయింగ్ చివరి రౌండ్‌లో సిరిల్ వర్మ 15-9, 15-7తో కబీర్ కంజార్కర్ (మహారాష్ట్ర)పై, కనిష్క్ 15-8, 15-5తో మిథున్ (కర్ణాటక)పై గెలిచారు. మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్‌లో డి.పూజ 18-16, 15-11తో స్వాతి శర్మ (ఉత్తరాఖండ్)పై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో రాష్ట్రానికే చెందిన కె.వైష్ణవి 15-9, 11-15, 12-15తో జూహీ దేవాంగన్ (చత్తీస్‌గఢ్) చేతిలో ఓడిపోయి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయింది. అన్ని విభాగాల్లో మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు గురువారం మొదలవుతాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement