చాంప్ సింధు | champion P.V sindhu | Sakshi
Sakshi News home page

చాంప్ సింధు

Published Mon, Feb 3 2014 12:41 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

చాంప్ సింధు - Sakshi

చాంప్ సింధు

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్టార్ షట్లర్ పి.వి.సింధు అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా నిలిచింది. కొచ్చిలో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో టాప్ సీడ్ సింధు 21-11, 21-11తో మూడో సీడ్ పి.సి.తులసి (కేరళ)పై ఘనవిజయం సాధించింది. ఇక మహిళల డబుల్స్‌లోనూ రాష్ట్రానికి చెందిన సిక్కిరెడ్డి జోడి టైటిల్ సాధించింది.
 
  ఫైనల్లో అపర్ణ బాలన్ జతగా మూడో సీడ్ సిక్కి రెడ్డి 21-16, 21-13తో టాప్ సీడ్ ప్రజక్తా సావంత్-ఆరతి సారా జంటను కంగు తినిపించింది. కాగా, పురుషుల సింగిల్స్ టైటిల్‌ను హెచ్.ఎస్.ప్రణయ్ గెలుచుకోగా... డబుల్స్‌లో ప్రణవ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్ ద్వయం చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో ప్రణయ్ 21-13, 21-2తో అనూప్ శ్రీధర్‌పై ఏకపక్ష విజయం నమోదు చేశాడు. డబుల్స్‌లో టాప్ సీడ్ ప్రణవ్-దివాల్కర్ జోడి 21-9, 23-25, 21-19 తో రెండో సీడ్ ఆల్విన్ ఫ్రాన్సిస్-అరుణ్ విష్ణు జంటపై గెలుపొందింది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో అరుణ్ విష్ణు-అపర్ణ బాలన్ ద్వయం విజేతగా నిలిచింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement