బెంగళూరు: అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో సిక్కిరెడ్డి-మేఘన జోడీ డబుల్స్ టైటిల్ గెలిచింది. ఫైనల్లో 21-19, 21-19తో టాప్‌సీడ్ ప్రజక్తా-ఆరతి జోడీపై నెగ్గారు.
మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో సిక్కిరెడ్డి-నందగోపాల్ ద్వయం 14-21, 14-21తో టాప్ సీడ్ తరుణ్ కొన (ఆంధ్రప్రదేశ్)- అశ్విని పొన్నప్ప జోడి చేతిలో పరాజయం చవిచూసింది. పురుషుల డబుల్స్ టైటిల్ పోరులో నందగోపాల్-హేమ నాగేంద్రబాబు (ఏపీ) ఓడిపోయారు. కాగా మహిళల సింగిల్స్ టైటిల్‌ను తాన్వీ లాడ్, పురుషుల టైటిల్‌ను అనూప్ శ్రీధర్ చేజిక్కించుకున్నారు.
సిక్కి రెడ్డి జోడికి టైటిల్
Published Sun, Feb 9 2014 12:53 AM | Last Updated on Sat, Sep 2 2017 3:29 AM
Advertisement
Advertisement