ఫైనల్లో నందగోపాల్, సిక్కి రెడ్డి జోడిలు | nanda gopal,sika reddy entered in finals | Sakshi
Sakshi News home page

ఫైనల్లో నందగోపాల్, సిక్కి రెడ్డి జోడిలు

Published Sat, Feb 8 2014 12:13 AM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM

nanda gopal,sika reddy entered in finals

బెంగళూరు: అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నందగోపాల్, సిక్కి రెడ్డి తమ భాగస్వాములతో కలిసి డబుల్స్ విభాగాల్లో టైటిల్ పోరుకు అర్హత సాధించారు. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో నందగోపాల్-హేమనాగేంద్ర బాబు (ఆంధ్రప్రదేశ్) జంట 21-10, 21-11తో ఆంటోనీ బెన్నెట్-సూరజ్ జోడిపై గెలిచింది. మిక్స్‌డ్ డబుల్స్ సెమీఫైనల్లో నందగోపాల్-సిక్కి రెడ్డి ద్వయం 21-14, 21-16తో హేమనాగేంద్ర బాబు-పూర్వీషా రామ్ జోడిని ఓడించింది.
 
 మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సిక్కి రెడ్డి-మేఘన జంట 21-14, 21-17తో ధన్యా నాయర్-మోహితా సచ్‌దేవ్ ద్వయంపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో క్వాలిఫయర్ సిరిల్ వర్మ (ఆంధ్రప్రదేశ్) 15-21, 21-18, 13-21తో అనూప్ శ్రీధర్ (కర్ణాటక) చేతిలో ఓడిపోయాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement