జింఖానా, న్యూస్‌లైన్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) నిర్వహించిన టాప్ ఎగ్జిక్యూటివ్స్ క్రి కెట్ మ్యాచ్‌లో మేనేజింగ్ డెరైక్టర్స్ (ఎండీ) ఎలెవన్ జట్టు విజేతగా నిలిచింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఎండీ ఎలెవన్ జట్టు 16 పరుగుల తేడాతో చీఫ్ జనరల్ మేనేజర్స్ (సీఎంజీ) ఎలెవన్ జట్టుపై గెలుపొందింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఎండీ ఎలెవన్ 131 పరుగులు చేసి ఆలౌటైంది. వెంకటేశ్ రెడ్డి (38), మురళి (15) ఫర్వాలేదనిపించారు. సీఎంజీ ఎలెవన్ బౌలర్ జ్యోత్ ఘోష్ 3 వికెట్లు చేజిక్కించుకున్నాడు. తర్వాత బరిలోకి దిగిన సీఎంజీ ఎలెవన్ 115 పరుగులకే కుప్పకూలింది. నిగమ్ (48), శామ్‌సన్ (15) చక్కని ఆట తీరు కనబరిచారు.
ఎండీ ఎలెవన్ బౌలర్ వాసుకి 3 వికెట్లు పడగొట్టి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ టైటిల్‌ని దక్కించుకోగా... వెంకటేశ్ రెడ్డి ‘బెస్ట్ ఫీల్డర్’ టైటిల్‌ని సొంతం చేసుకున్నాడు. సీఎంజీ ఎలెవన్ క్రీడాకారుడు నిగమ్ ‘బెస్ట్ బ్యాట్స్‌మన్’ టైటిల్‌ని గెలుచుకోగా... జ్యోత్ ఘోష్ ‘బెస్ట్ బౌలర్’ టైటిల్‌ని కైవసం చేసుకున్నాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజింగ్ డెరైక్టర్ ఎం. భగవంత రావు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు.
ఎండీ ఎలెవన్ జట్టు గెలుపు
Published Mon, Feb 17 2014 12:08 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 AM
Advertisement
Advertisement