జింఖానా, న్యూస్‌లైన్: బ్యాటింగ్‌లో సచిన్ (77 నాటౌట్) రాణించడంతో ఏఓసీ జట్టు హెచ్‌సీఏ మూడు రోజుల నాకౌట్ టోర్నీలో విజయాన్ని దక్కించుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఇండియా సిమెంట్ జట్టుపై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండి యా సిమెంట్ 213 పరుగులు చేసింది.
అసదుద్దీన్ (52) అర్ధ సెంచరీతో రాణించగా... షాకీర్ (32), ఫయాజ్ అహ్మద్ (36), సంగ్రామ్ (33) ఫర్వాలేదనిపించారు. అనంతరం బరిలోకి దిగిన ఏఓసీ మూడు వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసి నెగ్గింది. సచిన్‌తో పాటు ఆర్‌కే పాండే (59) అర్ధ సెంచరీతో చెలరేగాడు. మరో మ్యాచ్‌లో ఆంధ్రాబ్యాంక్ జట్టు 5 వికెట్ల తేడాతో ఆర్ దయానంద్ జట్టుపై విజయం సాధించింది.
మొదట ఆర్ దయానంద్ 7 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. నిమేష్ (77) రాణించాడు. తర్వాత ఆంధ్రాబ్యాంక్ 5 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. రవితేజ (54), నవీన్ (61), అభినవ్ కుమార్ (42) మెరుగ్గా ఆడారు. మరో మ్యాచ్‌లో బీడీఎల్ జట్టు 9 వికెట్ల తేడాతో ఎవర్‌గ్రీన్ జట్టుపై నెగ్గింది. మొదట ఎవర్‌గ్రీన్ 180 పరుగులు చేయగా... బీడీఎల్ ఒక వికెట్ కోల్పోయి 182 పరుగులు చేసి గెలిచింది.
రాణించిన సచిన్
Published Thu, Feb 6 2014 12:17 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 AM
Advertisement
Advertisement