Knock out tournment
-
నేటి నుంచి దేవధర్ ట్రోఫీ
విశాఖపట్నం, న్యూస్‌లైన్: ప్రతిష్టాత్మక జోనల్ వన్డే నాకౌట్ టోర్నీ దేవధర్ ట్రోఫీ ఆదివారం నుంచి విశాఖపట్నంలో ప్రారంభం కానుంది. ఇక్కడి వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరగనున్న ఈ టోర్నీలో నేడు సెంట్రల్ జోన్-ఈస్ట్‌జోన్ మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు 24న తొలి సెమీఫైనల్లో వెస్ట్‌జోన్‌తో తలపడనుంది. రెండో సెమీ ఫైనల్లో 25న నార్త్, సౌత్‌జోన్ జట్లు తలపడనున్నాయి. ఫైనల్ పోరు 27న జరగనుంది. వెస్ట్‌జోన్‌కు పుజారా, నార్త్‌జోన్‌కు హర్భజన్, సౌత్‌జోన్‌కు వినయ్ కుమార్, ఈస్ట్ జోన్‌కు లక్మీరతన్ శుక్లా, సెంట్రల్‌జోన్‌కు పీయూష్ చావ్లా నాయకత్వం వహిస్తున్నారు. -
ఫైనల్లో పోస్టల్
జింఖానా, న్యూస్‌లైన్: కిషన్ ప్రసాద్ వన్డే నాకౌట్ టోర్నీలో పోస్టల్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో పోస్టల్ జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో హెచ్‌యూసీసీ జట్టుపై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హెచ్‌యూసీసీ 116 పరుగులకే కుప్పకూలింది. తర్వాత బరిలోకి దిగిన పోస్టల్ ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 120 పరుగులు చేసింది. క్రాంతి కుమార్ (59 నాటౌట్) అర్ధ సెంచరీతో అజేయంగా నిలవగా... విజయ్ కుమార్ 31 పరుగులు చేశాడు. అంతర్ జిల్లా అండర్-14 వన్డే టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో నిజామాబాద్ జట్టు 166 పరుగుల తేడాతో నల్గొండ జట్టుపై గెలుపొందింది. మొదట నిజామాబాద్ 264 పరుగులు చేసి ఆలౌటైంది. అనికేత్ రెడ్డి (97), అఫ్రోజ్ ఖాన్ (57) అర్ధ సెంచరీలతో చెలరేగారు. నల్గొండ బౌలర్ గోవింద్ 4 వికెట్లు పడగొట్టాడు. తర్వాత లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన నల్గొండ 98 పరుగులకే చేతులెత్తేసింది. నిజామాబాద్ బౌలర్లు అనికేత్ రెడ్డి, సుచిత్ చెరి మూడు వికెట్లు తీసుకున్నారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు ఆదిలాబాద్: 205 (హిమతేజ 42, రోహన్ 35; సుజిత్ 3/33); వరంగల్: 130 (సుకృత్ 35; హర్షద్ 5/36). ఖమ్మం: 95 (సిద్ధార్థ్ రెడ్డి 6/31); కరీంనగర్: 100/3 (శ్రీకిరణ్ 40 నాటౌట్). -
రాణించిన సచిన్
జింఖానా, న్యూస్‌లైన్: బ్యాటింగ్‌లో సచిన్ (77 నాటౌట్) రాణించడంతో ఏఓసీ జట్టు హెచ్‌సీఏ మూడు రోజుల నాకౌట్ టోర్నీలో విజయాన్ని దక్కించుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఇండియా సిమెంట్ జట్టుపై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండి యా సిమెంట్ 213 పరుగులు చేసింది. అసదుద్దీన్ (52) అర్ధ సెంచరీతో రాణించగా... షాకీర్ (32), ఫయాజ్ అహ్మద్ (36), సంగ్రామ్ (33) ఫర్వాలేదనిపించారు. అనంతరం బరిలోకి దిగిన ఏఓసీ మూడు వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసి నెగ్గింది. సచిన్‌తో పాటు ఆర్కే పాండే (59) అర్ధ సెంచరీతో చెలరేగాడు. మరో మ్యాచ్‌లో ఆంధ్రాబ్యాంక్ జట్టు 5 వికెట్ల తేడాతో ఆర్ దయానంద్ జట్టుపై విజయం సాధించింది. మొదట ఆర్ దయానంద్ 7 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. నిమేష్ (77) రాణించాడు. తర్వాత ఆంధ్రాబ్యాంక్ 5 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. రవితేజ (54), నవీన్ (61), అభినవ్ కుమార్ (42) మెరుగ్గా ఆడారు. మరో మ్యాచ్‌లో బీడీఎల్ జట్టు 9 వికెట్ల తేడాతో ఎవర్గ్రీన్ జట్టుపై నెగ్గింది. మొదట ఎవర్గ్రీన్ 180 పరుగులు చేయగా... బీడీఎల్ ఒక వికెట్ కోల్పోయి 182 పరుగులు చేసి గెలిచింది. -
సెంచరీతో చెలరేగిన ప్రసాద్
జింఖానా, న్యూస్‌లైన్: చార్మినార్ సీసీ బ్యాట్స్‌మన్ ప్రసాద్ (116) సెంచరీతో చెలరేగడంతో ఆ జట్టు 124 పరుగుల తేడాతో ఆక్స్ఫర్డ్ బ్లూస్ జట్టుపై గెలుపొందింది. ఎ-డివిజన్ వన్డే నాకౌట్ టోర్నీలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చార్మినార్ సీసీ 8 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. మహ్మద్ ముజీబ్ (96) అర్ధ సెంచరీతో రాణించాడు. ఆక్స్ఫర్డ్ బ్లూస్ బౌలర్ బారన్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంత రం బరిలోకి దిగిన ఆక్స్ఫర్డ్ బ్లూస్ జట్టు 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీపాంకర్ (106) సెంచరీతో కదం తొక్కాడు. చార్మినార్ సీసీ బౌలర్ అహ్మద్ 4 వికెట్లు చేజిక్కించుకున్నాడు. మరో మ్యాచ్‌లో అంబర్పేట్ జట్టు రెండు వికెట్ల తేడాతో కేంబ్రిడ్జ్ జట్టుపై విజయం సాధించింది. మొదట కేంబ్రిడ్జ్ జట్టు 6 వికెట్లకు 201 పరుగులు చేసింది. రజాక్ (61), ఇలియాస్ (39) మెరుగ్గా ఆడారు. తర్వాత బరిలోకి దిగిన అంబర్పేట్ 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసి నెగ్గింది. మహ్మద్ నోమన్ (51), రాకేష్ (64) అర్ధ సెంచరీలతో రాణించారు. కేంబ్రిడ్జ్ బౌలర్ జావేద్ 3 వికెట్లు తీసుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు: ఎస్బీఐ: 189/8 (విన్సెంట్ 43, ఇఫ్తికార్ 32); ఖల్సా: 148 (రాజ్ ఠాకూర్ 31; సంతోష్ 3/21, రంగనాథ్ 3/24). కాంటినెంటల్: 194 (రోహిత్ రెడ్డి 45, శశిధర్ 67, ప్రణీత్ రెడ్డి 31; సాయి తేజ 3/32); సాయిసత్య: 138 (నిఖిల్ జైస్వాల్ 50). -
అబ్దుల్ అజీమ్‌కు 6 వికెట్లు
జింఖానా, న్యూస్‌లైన్: అపెక్స్ సీసీ బౌలర్ అబ్దుల్ అజీమ్ (6/19) తన బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. దీంతో ఆ జట్టు 167 పరుగుల భారీ తేడాతో అభినవ్ కోల్ట్స్ జట్టుపై విజయం సాధించింది. హెచ్‌సీఏ కిషన్ ప్రసాద్ వన్డే నాకౌట్ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన అపెక్స్ సీసీ 9 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. సయ్యద్ పాషా అలీ (42), మీర్ జాఫర్ అలీ (44), సయ్యద్ అన్వర్ (30) మెరుగ్గా ఆడారు. అనంతరం బరిలోకి దిగిన అభినవ్ కోల్ట్స్... అజీమ్ ధాటికి 63 పరుగులకే కుప్పకూలింది. మరో మ్యాచ్‌లో బౌలర్ సోహైల్ (5/25) విజృంభించడంతో యంగ్ సిటిజన్ జట్టు 51 పరుగుల తేడాతో కాస్మోస్ జట్టుపై గెలుపు దక్కించుకుంది. మొదట బరిలోకి దిగిన యంగ్ సిటిజన్ జట్టు 147 చేసి ఆలౌటైంది. సోహైల్ 39 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. కాస్మోస్ జట్టు బౌలర్ కరన్ 3 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన కాస్మోస్ 96 పరుగుల వద్ద చేతులెత్తేసింది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు డబ్ల్యూఎంసీసీ: 160/7 (ప్రదీప్ 35, వంశీ యాదవ్ 35); షాలిమార్ సీసీ: 161/7 (కృష్ణ ప్రసాద్ 48). పీకేసీసీ: 135 (జయేష్ 32); భారతీయ: 138/2 (శ్రవణ్ కుమార్ 51, జనార్ధన్ 35 నాటౌట్ ). హెచ్‌యూసీసీ: 216 (మహ్మద్ అతీఖ్ 34, రమేష్ 33); తారకరామ: 155 (సతీష్ 30, రమాకాంత్ 52, ఖలీముద్దీన్ 3/9, అద్వైత్ ఆర్యన్ 3/29, మహ్మద్ ఒమర్ 3/30). బీహెచ్ఈఎల్: 112 (ఉదయ్ కుమార్ 5/21); ఎంపీ యంగ్‌మెన్: 113/2 (బాలాజి 40 నాటౌట్, అలీమ్ 37 నాటౌట్). ఎఫ్‌సీఐ: 178 (అరవింద్ 56, అక్బర్ 33, కృష్ణ 3/42); ఏకలవ్య: 179/5 (విశాల్ 41, మాథ్యూస్ 30 నాటౌట్; చంద్రశేఖర్ 3/20). క్లాసిక్: 132 (రఫీ 39, షాదాబ్ 4/26); హైదరాబాద్ పేట్రియట్స్: 106 (రఫీ 4/15). డెక్కన్ వాండరర్స్: 212/6 (మహ్మద్ అజీముద్దీన్ 37, వాసిఫ్ 30, ఇమ్రోస్ 53); ఎలెవన్ మాస్టర్: 210 (నరేష్ 30, రాజ్ కుమార్ 49). ఎ-ఇనిస్టిట్యూషన్ వన్డే లీగ్ ఐఏఎఫ్: 193/8 (సందీప్ 57, కిషన్ 42, రెహమాన్ 41; శ్యామ్ 3/53, గోవింద్ రెడ్డి 3/61); హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ: 78 (దహియా 4/35, దీపక్ 3/17). -
విజేత వెస్లీ కాలేజి
జింఖానా, న్యూస్‌లైన్: ఎడ్డీ ఐబరా అండర్-19 వన్డే నాకౌట్ టోర్నీలో వెస్లీ జూనియర్ కాలేజి విజేతగా నిలిచింది. భవాన్స్ జట్టుతో శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వెస్లీ బ్యాట్స్‌మన్ రాహుల్ (91 నాటౌట్) అర్ధ సెంచరీతో చెలరేగడంతో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బరిలోకి దిగిన భవాన్స్ 168 పరుగుల వద్ద ఆలౌటైంది. జట్టులో వికాస్ బిల్లా (50) అర్ధ సెంచరీతో రాణించగా.. నఫీజ్ 35 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. వెస్లీ బౌలర్స్ ప్రణీత్, చందన్, శ్రీకాంత్, నవీన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన వెస్లీ జట్టు నాలుగు వికెట్లకు 170 పరుగులు చేసింది. చైతన్య 47 పరుగులు చేసి చక్కని ఆటతీరు కనబరిచాడు. భవాన్స్ బౌలర్ నరేష్ రెండు వికెట్లు తీసుకున్నాడు. అంతర్ జిల్లా రెండు రోజుల లీగ్‌లో తొలి రోజు వరంగల్ జట్టు 227 పరుగులు చేసింది. జట్టులో ఫరూఖ్ (74), శరత్ యాదవ్ (47) రాణించారు. ఆదిలాబాద్ బౌలర్ రాకేష్ అత్యధికంగా 7 వికెట్లు తీసి అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. తర్వాత బరిలోకి దిగిన ఆదిలాబాద్ జట్టు ఆట ముగిసే సమయానికి ఎనిమిది వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. రమేష్ యాదవ్ (74) అర్ధ సెంచరీతో విజృంభించగా.. లఖ్మణ్ (31 నాటౌట్), వినోద్ (42 నాటౌట్) బరిలో ఉన్నారు. వరంగల్ బౌలర్ ఫరూఖ్ నాలుగు వికెట్ల్లు చేజిక్కించుకున్నాడు.