విశాఖపట్నం, న్యూస్‌లైన్: ప్రతిష్టాత్మక జోనల్ వన్డే నాకౌట్ టోర్నీ దేవధర్ ట్రోఫీ ఆదివారం నుంచి విశాఖపట్నంలో ప్రారంభం కానుంది. ఇక్కడి వైఎస్‌ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరగనున్న ఈ టోర్నీలో నేడు సెంట్రల్ జోన్-ఈస్ట్‌జోన్ మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు 24న తొలి సెమీఫైనల్లో వెస్ట్‌జోన్‌తో తలపడనుంది. రెండో సెమీ ఫైనల్లో 25న నార్త్, సౌత్‌జోన్ జట్లు తలపడనున్నాయి. ఫైనల్ పోరు 27న జరగనుంది. వెస్ట్‌జోన్‌కు పుజారా, నార్త్‌జోన్‌కు హర్భజన్, సౌత్‌జోన్‌కు వినయ్ కుమార్, ఈస్ట్ జోన్‌కు లక్మీరతన్ శుక్లా, సెంట్రల్‌జోన్‌కు పీయూష్ చావ్లా నాయకత్వం వహిస్తున్నారు.
నేటి నుంచి దేవధర్ ట్రోఫీ
Published Sun, Mar 23 2014 1:40 AM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM
Advertisement
Advertisement