ఫైనల్లో పోస్టల్ | postal team entered in finals | Sakshi
Sakshi News home page

ఫైనల్లో పోస్టల్

Published Thu, Feb 13 2014 12:12 AM | Last Updated on Tue, Sep 18 2018 8:19 PM

postal team entered in finals

జింఖానా, న్యూస్‌లైన్: కిషన్ ప్రసాద్ వన్డే నాకౌట్ టోర్నీలో పోస్టల్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో పోస్టల్ జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో హెచ్‌యూసీసీ జట్టుపై ఘనవిజయం సాధించింది.
 
  మొదట బ్యాటింగ్ చేసిన హెచ్‌యూసీసీ 116 పరుగులకే కుప్పకూలింది. తర్వాత బరిలోకి దిగిన పోస్టల్ ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 120 పరుగులు చేసింది. క్రాంతి కుమార్ (59 నాటౌట్) అర్ధ సెంచరీతో అజేయంగా నిలవగా... విజయ్ కుమార్ 31 పరుగులు చేశాడు.
 
 అంతర్ జిల్లా అండర్-14 వన్డే టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో నిజామాబాద్ జట్టు 166 పరుగుల తేడాతో నల్గొండ జట్టుపై గెలుపొందింది. మొదట నిజామాబాద్ 264 పరుగులు చేసి ఆలౌటైంది. అనికేత్ రెడ్డి (97), అఫ్రోజ్ ఖాన్ (57) అర్ధ సెంచరీలతో చెలరేగారు. నల్గొండ బౌలర్ గోవింద్ 4 వికెట్లు పడగొట్టాడు. తర్వాత లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన నల్గొండ 98 పరుగులకే చేతులెత్తేసింది. నిజామాబాద్ బౌలర్లు అనికేత్ రెడ్డి, సుచిత్ చెరి మూడు వికెట్లు తీసుకున్నారు.
 
 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
 ఆదిలాబాద్: 205 (హిమతేజ 42, రోహన్ 35; సుజిత్ 3/33); వరంగల్: 130 (సుకృత్ 35; హర్షద్ 5/36).
 
  ఖమ్మం: 95 (సిద్ధార్థ్ రెడ్డి 6/31); కరీంనగర్: 100/3 (శ్రీకిరణ్ 40 నాటౌట్).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement