జింఖానా, న్యూస్‌లైన్: అపెక్స్ సీసీ బౌలర్ అబ్దుల్ అజీమ్ (6/19) తన బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. దీంతో ఆ జట్టు 167 పరుగుల భారీ తేడాతో అభినవ్ కోల్ట్స్ జట్టుపై విజయం సాధించింది. హెచ్‌సీఏ కిషన్ ప్రసాద్ వన్డే నాకౌట్ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన అపెక్స్ సీసీ 9 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. సయ్యద్ పాషా అలీ (42), మీర్ జాఫర్ అలీ (44), సయ్యద్ అన్వర్ (30) మెరుగ్గా ఆడారు.
అనంతరం బరిలోకి దిగిన అభినవ్ కోల్ట్స్... అజీమ్ ధాటికి 63 పరుగులకే కుప్పకూలింది. మరో మ్యాచ్‌లో బౌలర్ సోహైల్ (5/25) విజృంభించడంతో యంగ్ సిటిజన్ జట్టు 51 పరుగుల తేడాతో కాస్మోస్ జట్టుపై గెలుపు దక్కించుకుంది. మొదట బరిలోకి దిగిన యంగ్ సిటిజన్ జట్టు 147 చేసి ఆలౌటైంది. సోహైల్ 39 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. కాస్మోస్ జట్టు బౌలర్ కరన్ 3 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన కాస్మోస్ 96 పరుగుల వద్ద చేతులెత్తేసింది.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
డబ్ల్యూఎంసీసీ: 160/7 (ప్రదీప్ 35, వంశీ యాదవ్ 35); షాలిమార్ సీసీ: 161/7 (కృష్ణ ప్రసాద్ 48).
పీకేసీసీ: 135 (జయేష్ 32); భారతీయ: 138/2 (శ్రవణ్ కుమార్ 51, జనార్ధన్ 35 నాటౌట్ ).
హెచ్‌యూసీసీ: 216 (మహ్మద్ అతీఖ్ 34, రమేష్ 33); తారకరామ: 155 (సతీష్ 30, రమాకాంత్ 52, ఖలీముద్దీన్ 3/9, అద్వైత్ ఆర్యన్ 3/29, మహ్మద్ ఒమర్ 3/30).
బీహెచ్‌ఈఎల్: 112 (ఉదయ్ కుమార్ 5/21); ఎంపీ యంగ్‌మెన్: 113/2 (బాలాజి 40 నాటౌట్, అలీమ్ 37 నాటౌట్).
ఎఫ్‌సీఐ: 178 (అరవింద్ 56, అక్బర్ 33, కృష్ణ 3/42); ఏకలవ్య: 179/5 (విశాల్ 41, మాథ్యూస్ 30 నాటౌట్; చంద్రశేఖర్ 3/20).
క్లాసిక్: 132 (రఫీ 39, షాదాబ్ 4/26); హైదరాబాద్ పేట్రియట్స్: 106 (రఫీ 4/15).
డెక్కన్ వాండరర్స్: 212/6 (మహ్మద్ అజీముద్దీన్ 37, వాసిఫ్ 30, ఇమ్రోస్ 53); ఎలెవన్ మాస్టర్: 210 (నరేష్ 30, రాజ్ కుమార్ 49).
ఎ-ఇనిస్టిట్యూషన్ వన్డే లీగ్
ఐఏఎఫ్: 193/8 (సందీప్ 57, కిషన్ 42, రెహమాన్ 41; శ్యామ్ 3/53, గోవింద్ రెడ్డి 3/61); హెచ్‌ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్‌బీ: 78 (దహియా 4/35, దీపక్ 3/17).
అబ్దుల్ అజీమ్‌కు 6 వికెట్లు
Published Thu, Jan 2 2014 11:57 PM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM
Advertisement