Abdul Azeem
-
మిమ్మల్ని చివరిగా ఒక్కసారైనా కలవాలనుకున్నా.. కానీ: సిరాజ్ భావోద్వేగం
Mohammed Siraj Dedicates POTM To Late Hyderabad Cricketer: ‘‘ప్రియమైన అజీం సర్. నాకు, నాలాంటి ఎంతో మందికి మీరు అందించిన ప్రోత్సాహం గురించి నేనెప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. మీ మనసు ఎంతో మంచిది. ఇతరుల పట్ల దయ కలిగి ఉంటారు. తోచిన సహాయం చేస్తారు. నాకు మిమ్మల్ని పరిచయం చేసినందుకు ఆ దేవుడికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. కానీ మీ కడచూపునకు నోచుకోలేకపోయాను. ఈనాటి ఈ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ను మీకు అంకితం ఇస్తున్నాను’’ అంటూ హైదరాబాదీ స్టార్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేసర్ మహ్మద్ సిరాజ్ భావోద్వేగపూరిత ట్వీట్ చేశాడు. చివరిగా ఒక్కసారైనా అజీం సర్‌ను కలవాలనుకున్నానని.. అయితే, అంతకంటే ముందే ఆయన శాశ్వతంగా లోకాన్ని వీడి వెళ్లారంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. నాలుగు వికెట్లతో మెరిసి ఐపీఎల్-2023లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో సిరాజ్ నాలుగు వికెట్లతో మెరిశాడు. మొత్తంగా 4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన ఈ ఆర్సీబీ స్టార్.. కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చాడు. పంజాబ్ ఓపెనర్ అథర్వ టైడే(4), పవర్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్(2), హర్‌ప్రీత్ బ్రార్(13), నాథన్ ఎల్లిస్ (1)ల వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అదే విధంగా హర్‌ప్రీత్ సింగ్ భాటియాను రనౌట్ చేశాడు. ఇలా మొహాలీ మ్యాచ్‌లో పంజాబ్‌పై ఆర్సీబీ గెలుపొందడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో తనకు దక్కిన అవార్డును.. ఇటీవల మరణించిన హైదరాబాద్ మాజీ క్రికెటర్ అబ్దుల్ అజీంకు అంకితమిచ్చాడు. ఆయనతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. కోచ్‌గా, సెలక్టర్‌గా 62 ఏళ్ల అబ్దుల్ అజీం అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. 80,90 దశకాల్లో హైదరాబాద్ జట్టు తరఫున మేటి ఓపెనర్‌గా ఎదిగిన ఆయన మొత్తంగా తన కెరీర్లో 73 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 4644 పరుగులు సాధించాడు. ఇందులో 12 సెంచరీలు ఉండటం విశేషం. ఇక ఆటగాడిగా కెరీర్ ముగించిన తర్వాత అజీం హైదరాబాద్ కోచ్‌గా, సెలక్టర్‌గా పని చేశారు. చదవండి: సర్జరీ సక్సెస్... టీమిండియాకు గుడ్‌న్యూస్! మెగా టోర్నీకి అందుబాటులోకి! ఒకప్పుడు టీమిండియా కెప్టెన్.. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్! 𝘽𝙖𝙘𝙠 𝙩𝙤 𝙬𝙞𝙣𝙣𝙞𝙣𝙜 𝙬𝙖𝙮𝙨 😎@RCBTweets clinch a 24-run victory over #PBKS in Mohali 🙌🙌 Scorecard ▶️ https://t.co/CQekZNsh7b#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/RGFwXXz5eC — IndianPremierLeague (@IPL) April 20, 2023 Dear Azeem Sir, m going to alwz appreciate what you have done for me & many others like me. You were so generous, kind & helpful, cant thank god enough to make me meet you. Wish I had gotten one last chance to meet u but nevertheless I’d like to dedicate today’s POTM award to you pic.twitter.com/XIp08EnybF — Mohammed Siraj (@mdsirajofficial) April 20, 2023 -
హార్ట్ టచింగ్: నేలకు దిగిన న్యాయం!
భూపాలపల్లి: ఓ దివ్యాంగుడు లేవలేని స్థితిలో కలెక్టర్ గది వద్ద ఓ అర్జీ పట్టుకొని కూర్చున్నాడు. అటు నుంచి వచ్చిన కలెక్టర్ అబ్దుల్ అజీమ్.. అతని దీనస్థితిని గమనించి.. హోదాను పక్కనబెట్టి తాను సైతం కింద కూర్చొని సమస్యను ఓపికగా విన్నారు. నేనున్నానని, న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ సంఘటన మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్లో చోటుచేసుకుంది. వివరాలు.. సింగరేణి బొగ్గు గని ఏర్పాటులో ఇల్లు కోల్పోయిన తనకు పునరావాసం కల్పించాలని కోరేందుకు గణపురం మండలం ధర్మారావుపేట గ్రామపంచాయతీ పరిధిలోని మాధవరావుపల్లికి చెందిన దివ్యాంగుడు కల్లెబోయిన వెంకటేశ్వర్లు కలెక్టరేట్‌కు వచ్చాడు. (చదవండి: సొంతూళ్లోనే కాయకష్టం) కలెక్టర్ గది వద్ద అతను వేచి ఉండగా.. అదే సమయంలో కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీమ్ వచ్చారు. దీంతో వెంకటేశ్వర్లు పరిస్థితిని గమనించిన కలెక్టర్ చలించిపోయారు. తాను కూడా కింద కూర్చుని సమస్యను వినమ్రంగా విన్నారు. గని ఏర్పాటుకు ఇల్లు కోల్పోయిన తనకు సింగరేణి సంస్థ పరిహారం చెల్లించినా.. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద పునరావాసం కల్పించలేదని బాధితుడు వాపోయాడు. ఈ విషయాన్ని పరిశీలించి త్వరలో తగిన న్యాయం చేస్తానని కలెక్టర్ హామీ ఇవ్వడంతో వెంకటేశ్వర్లు ఇంటికి బయలుదేరాడు. కాగా, గత ఫిబ్రవరిలో తన కార్యాలయం వద్ద మెట్లపై కూర్చుని నిరీక్షిస్తున్న గిరిజన వృద్ధురాలి పక్కనే కూర్చోని ఆమె సమస్యను కలెక్టర్ అబ్దుల్ అజీమ్ అక్కడికక్కడే పరిష్కరించి మన్నలు పొందారు. (కడుపులో కాటన్ కుక్కి ఆపరేషన్) -
అబ్దుల్ అజీమ్‌కు 6 వికెట్లు
జింఖానా, న్యూస్‌లైన్: అపెక్స్ సీసీ బౌలర్ అబ్దుల్ అజీమ్ (6/19) తన బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. దీంతో ఆ జట్టు 167 పరుగుల భారీ తేడాతో అభినవ్ కోల్ట్స్ జట్టుపై విజయం సాధించింది. హెచ్‌సీఏ కిషన్ ప్రసాద్ వన్డే నాకౌట్ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన అపెక్స్ సీసీ 9 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. సయ్యద్ పాషా అలీ (42), మీర్ జాఫర్ అలీ (44), సయ్యద్ అన్వర్ (30) మెరుగ్గా ఆడారు. అనంతరం బరిలోకి దిగిన అభినవ్ కోల్ట్స్... అజీమ్ ధాటికి 63 పరుగులకే కుప్పకూలింది. మరో మ్యాచ్‌లో బౌలర్ సోహైల్ (5/25) విజృంభించడంతో యంగ్ సిటిజన్ జట్టు 51 పరుగుల తేడాతో కాస్మోస్ జట్టుపై గెలుపు దక్కించుకుంది. మొదట బరిలోకి దిగిన యంగ్ సిటిజన్ జట్టు 147 చేసి ఆలౌటైంది. సోహైల్ 39 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. కాస్మోస్ జట్టు బౌలర్ కరన్ 3 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన కాస్మోస్ 96 పరుగుల వద్ద చేతులెత్తేసింది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు డబ్ల్యూఎంసీసీ: 160/7 (ప్రదీప్ 35, వంశీ యాదవ్ 35); షాలిమార్ సీసీ: 161/7 (కృష్ణ ప్రసాద్ 48). పీకేసీసీ: 135 (జయేష్ 32); భారతీయ: 138/2 (శ్రవణ్ కుమార్ 51, జనార్ధన్ 35 నాటౌట్ ). హెచ్‌యూసీసీ: 216 (మహ్మద్ అతీఖ్ 34, రమేష్ 33); తారకరామ: 155 (సతీష్ 30, రమాకాంత్ 52, ఖలీముద్దీన్ 3/9, అద్వైత్ ఆర్యన్ 3/29, మహ్మద్ ఒమర్ 3/30). బీహెచ్ఈఎల్: 112 (ఉదయ్ కుమార్ 5/21); ఎంపీ యంగ్‌మెన్: 113/2 (బాలాజి 40 నాటౌట్, అలీమ్ 37 నాటౌట్). ఎఫ్‌సీఐ: 178 (అరవింద్ 56, అక్బర్ 33, కృష్ణ 3/42); ఏకలవ్య: 179/5 (విశాల్ 41, మాథ్యూస్ 30 నాటౌట్; చంద్రశేఖర్ 3/20). క్లాసిక్: 132 (రఫీ 39, షాదాబ్ 4/26); హైదరాబాద్ పేట్రియట్స్: 106 (రఫీ 4/15). డెక్కన్ వాండరర్స్: 212/6 (మహ్మద్ అజీముద్దీన్ 37, వాసిఫ్ 30, ఇమ్రోస్ 53); ఎలెవన్ మాస్టర్: 210 (నరేష్ 30, రాజ్ కుమార్ 49). ఎ-ఇనిస్టిట్యూషన్ వన్డే లీగ్ ఐఏఎఫ్: 193/8 (సందీప్ 57, కిషన్ 42, రెహమాన్ 41; శ్యామ్ 3/53, గోవింద్ రెడ్డి 3/61); హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ: 78 (దహియా 4/35, దీపక్ 3/17). -
మూడో ఏడాదీ కొనసాగింపు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సీనియర్ జట్టు కోచ్‌గా భారత మాజీ స్పిన్నర్ సునీల్ జోషి కొనసాగనున్నాడు. గత రెండేళ్లుగా జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్న జోషిపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నమ్మకముంచింది. 2011-12 సీజన్లో సునీల్ జోషి తొలి సారిగా హైదరాబాద్ జట్టు కోచింగ్ బాధ్యతలు చేపట్టాడు. ఆ సీజన్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చిన హైదరాబాద్, ‘ప్లేట్’ డివిజన్ నుంచి ‘ఎలైట్’ స్థాయికి ఎగబాకింది. దాంతో గత సీజన్లో మరిన్ని ప్రోత్సాహకాలు అందజేస్తూ ఏకగ్రీవంగా జోషిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే 2012-13 సీజన్ మాత్రం హైదరాబాద్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. గ్రూప్ ‘ఎ’లో ఉన్న జట్టు చెత్త ఆటతీరుతో గ్రూప్ ‘సి’కి పడిపోయింది. దాంతో జోషిపై కూడా విమర్శలు వచ్చాయి. హెచ్‌సీఏలో దీనిపై తీవ్ర చర్చ కూడా జరగడంతో సీనియర్ టీమ్ కోచ్ ఎంపికను వాయిదా వేస్తూ వచ్చారు. బుచ్చిబాబు టోర్నీలో పాల్గొనే జట్టుకు అబ్దుల్ అజీమ్‌ను కోచ్‌గా ఎంపిక చేయడంతో జోషికి గుడ్‌బై చెప్పినట్లేనని భావించారు. అయితే జట్టు వైఫల్యాలకు కోచ్‌నే పూర్తిగా బాధ్యుడిని చేయాల్సిన అవసరం లేదని, కోచ్‌గా అతను బాగా చేస్తున్నాడని హెచ్‌సీఏ సభ్యులు కొంత మంది కితాబిచ్చారు. ఫలితంగా సునీల్ జోషినే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల 2నుంచి జరిగే మొయినుద్దౌలా గోల్డ్ కప్ టోర్నీనుంచి జోషి తన బాధ్యతలు చేపడతాడు.