సెంచరీతో చెలరేగిన ప్రసాద్ | prasad hits century | Sakshi
Sakshi News home page

సెంచరీతో చెలరేగిన ప్రసాద్

Published Sat, Jan 25 2014 12:05 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM

prasad hits century

 జింఖానా, న్యూస్‌లైన్: చార్మినార్ సీసీ బ్యాట్స్‌మన్ ప్రసాద్ (116) సెంచరీతో చెలరేగడంతో ఆ జట్టు 124 పరుగుల తేడాతో ఆక్స్‌ఫర్డ్ బ్లూస్ జట్టుపై గెలుపొందింది. ఎ-డివిజన్ వన్డే నాకౌట్ టోర్నీలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చార్మినార్ సీసీ 8 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. మహ్మద్ ముజీబ్ (96) అర్ధ సెంచరీతో రాణించాడు. ఆక్స్‌ఫర్డ్ బ్లూస్ బౌలర్ బారన్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంత రం బరిలోకి దిగిన ఆక్స్‌ఫర్డ్ బ్లూస్ జట్టు 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది.
 
  దీపాంకర్ (106) సెంచరీతో కదం తొక్కాడు. చార్మినార్ సీసీ బౌలర్ అహ్మద్ 4 వికెట్లు చేజిక్కించుకున్నాడు. మరో మ్యాచ్‌లో అంబర్‌పేట్ జట్టు రెండు వికెట్ల తేడాతో కేంబ్రిడ్జ్ జట్టుపై విజయం సాధించింది. మొదట కేంబ్రిడ్జ్ జట్టు 6 వికెట్లకు 201 పరుగులు చేసింది. రజాక్ (61), ఇలియాస్ (39) మెరుగ్గా ఆడారు. తర్వాత బరిలోకి దిగిన అంబర్‌పేట్ 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసి నెగ్గింది. మహ్మద్ నోమన్ (51), రాకేష్ (64) అర్ధ సెంచరీలతో రాణించారు. కేంబ్రిడ్జ్ బౌలర్ జావేద్ 3 వికెట్లు తీసుకున్నాడు.
 
 
 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు: ఎస్‌బీఐ: 189/8 (విన్సెంట్ 43, ఇఫ్తికార్ 32); ఖల్సా: 148 (రాజ్ ఠాకూర్ 31; సంతోష్ 3/21, రంగనాథ్ 3/24).  కాంటినెంటల్: 194 (రోహిత్ రెడ్డి 45, శశిధర్ 67, ప్రణీత్ రెడ్డి 31; సాయి తేజ 3/32); సాయిసత్య: 138 (నిఖిల్ జైస్వాల్ 50).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement