జింఖానా, న్యూస్‌లైన్: డాన్ బాస్కో హైస్కూల్ బౌలర్ రిత్విక్ 7 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. దీంతో హెచ్‌సీఏ బ్రదర్ జాన్ ఆఫ్ గాడ్ నాకౌట్ టోర్నీలో ఆ జట్టు 20 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన డాన్ బాస్కో 109 పరుగులు చేసింది. వశిష్ట బౌలర్ అరవింద్, నవీన్ చెరో మూడు వికెట్లు చేజిక్కించుకున్నారు. అనంతరం బరిలోకి దిగిన వశిష్ట జట్టు 89 పరుగుల వద్ద ఆలౌటైంది. నవీన్ (51) అర్ధ సెంచరీతో చెలరేగాడు.
మరో మ్యాచ్‌లో మెదక్ డిస్ట్రిక్ట్ బ్యాట్స్‌మన్ అఖిల్ నాయక్ (126 నాటౌట్) మెరుపు శతకంతో అజేయంగా నిలవడంతో ఆ జట్టు 149 పరుగుల భారీ తేడాతో డీఏవీ పబ్లిక్ స్కూల్‌పై ఘన విజయం సొంతం చేసుకుంది. తొలుత బరిలోకి దిగిన మెదక్ 225 పరుగులు చేసింది. డీఏవీ బౌలర్ కార్తీక్ ఆనంద్ 4 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత బరిలోకి దిగిన డీఏవీ పబ్లిక్ స్కూల్ 86 పరుగులకే కుప్పకూలింది. ఆనంద్ 5, మహ్మద్ అజ్మతుల్లా 3 వికెట్లు చేజిక్కించుకున్నారు.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
తక్షశిల పబ్లిక్ స్కూల్: 82 (ఇజాజ్ ఖాన్ 3/8); హైమౌంట్ హైస్కూల్: 85/8 (తరుణ్ కుమార్ 4/11, నీరజ్ కుమార్ 3/30).
సెయింట్ జోసెఫ్ హైస్కూల్(హబ్సిగూడ): 204 (ప్రత్యూష్ 77, మహ్మద్ ఖాజా పాషా 35; గ్యాబ్రియల్ 65; ప్రత్యూష్ 4/26).
భవాన్స్: 204/4 (జయవర్ధన్ 50, విష్ణునాయక్ 56; అజయ్ 4/50); వరంగల్ డిస్ట్రిక్ట్: 165 (త్రిషూల్ 36, అజయ్ 51 నాటౌట్; అభిషేకర్ 3/17, విష్ణునాయక్ 3/26).
రిత్విక్‌కు 7 వికెట్లు
Published Sat, Nov 9 2013 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 12:25 AM
Advertisement
Advertisement