జింఖానా, న్యూస్‌లైన్: కేయూసీఈటీ జట్టు బౌలర్ కళ్యాణ్ (4/13) చక్కని బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. దీంతో ఎస్‌ఆర్ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కేయూసీఈటీ జట్టు 7 వికెట్ల తేడాతో జయముఖి ఐటీఎస్ జట్టుపై విజయం సాధించింది. తొలుత బరిలోకి దిగిన జయముఖి జట్టు... కళ్యాణ్ ధాటికి 73 పరుగులకే కుప్పకూలింది. సత్యం 22, హర్ష 18 పరుగులు చేశారు.
అనంతరం బరిలోకి దిగిన కేయూసీఈటీ మూడే వికెట్లు కోల్పోయి నెగ్గింది. రాజ్‌కుమార్ 33 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. జయముఖి బౌలర్ అనిల్ ఒక వికెట్ తీసుకున్నాడు. బౌలింగ్‌లో చక్కని ప్రతిభ చూపిన కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మరో మ్యాచ్‌లో ఎస్‌వీఎస్‌ఐటీ జట్టు 8 పరుగుల తేడాతో జీఎన్‌ఐటీ జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఎస్‌వీఎస్‌ఐటీ 6 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది.
మున్నర్ (34), ప్రతీక్ (28 నాటౌట్) మెరుగ్గా ఆడారు. జీఎన్‌ఐటీ బౌలర్లు భరత్, పవన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. తర్వాత లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన జీఎన్‌ఐటీ 5 వికెట్ల నష్టానికి 118 పరుగులు మాత్రమే చేయగలిగింది. మనోజ్ 33 పరుగులు చేయగా... 38 పరుగుల చేసి అజేయంగా నిలిచిన జీవీకే మనోజ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
అపెక్స్ ఇంజినీరింగ్ కాలేజి: 78 (జీవన్‌లాల్ 38; హరీష్ 3/11); విజయ ఇంజినీరింగ్ కాలేజి: 79 (రాజ మణి 40 నాటౌట్; ప్రసాద్ 1/14).
వీఆర్‌ఈసీ: 109 (శ్రవణ్ 44; పవన్ 3/16); సీఎంఆర్‌ఈసీ: 110/9 (శ్రీధర్ 16; శ్రవణ్ 2/19, యోగేందర్ 2/11).
ఎన్‌ఐటీ: 111 (అఖిల్ 18, హరీష్ 2/17, వంశీ 2/16); రామప్ప ఇంజినీరింగ్ కాలేజి: 111 (వంశీ 32, రామ్ కిషోర్ 2/33).
ప్రసాద్ ఇంజినీరింగ్ కాలేజి: 90 (ప్రదీప్ 31; శ్రీధర్ 3/10, కార్తీక్ 3/19); ఎస్‌వీఐటీ: 92 (విజ్ఞాన్ 42, గౌతమ్ 34; రంజిత్ 1/13).
గీతాంజిలీ ఇంజినీరింగ్ కాలేజి: 157 (హరి 33, తరుణ్ 30; ఉదయ్ 2/33, చందు 2/15). ఎంఎల్‌ఆర్: 109/9 (వినోద్ 34, వివేక్ 19; కళ్యాణ్ 2/19).