జింఖానా, న్యూస్‌లైన్: అంతర్ జిల్లా క్యారమ్ చాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో ఎండీ అహ్మద్, మహిళల విభాగంలో సవితా దేవి విజేతలుగా నిలిచారు. ఖమ్మంలోని జూబ్లీ ఆఫీసర్స్ క్లబ్లో నిర్వహించిన ఈ పోటీల్లో బుధవారం జరిగిన పురుషుల విభాగం ఫైనల్లో అహ్మద్ 22-15, 25-7, 27-13తో నవీన్‌పై విజయం సాధించాడు.
అంతకుముందు జరిగిన సెమీఫైనల్స్‌లో అహ్మద్ 25-20, 14-25, 25-4తో దినేష్ బాబుపై, నవీన్ 21-4, 10-25, 25-22తో వసీమ్‌పై గెలుపొందారు. మహిళల విభాగం ఫైనల్లో సవిత 18-20, 22-9, 25-15తో పద్మజపై నెగ్గి టైటిల్‌ని కైవసం చేసుకుంది. వెటరన్ విభాగంలో మార్టిన్ మెనెజెస్ 25-6, 25-17తో మోహన్ మురళిపై గెలిచి టైటిల్ సాధించాడు. విజేతలకు డీఎస్పీ పి. బాలకృష్ణా రావు ముఖ్య అతిథిగా విచ్చేసి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జూబ్లీ ఆఫీసర్స్ క్లబ్ కార్యదర్శి ఎం. వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
విజేతలు అహ్మద్, సవిత
Published Thu, Jan 30 2014 12:11 AM | Last Updated on Sat, Sep 2 2017 3:09 AM
Advertisement