జింఖానా, న్యూస్‌లైన్: సెయింట్ ఆండ్రూస్ బౌలర్లు రిషబ్ (5/80), అలంకృత్ (3/14) ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించారు. దీంతో బ్రదర్ జాన్ ఆఫ్ గాడ్ అండర్-14 నాకౌట్ టోర్నీలో గురువారం జరిగిన మ్యాచ్‌లో సెయింట్ ఆండ్రూస్ 131 పరుగుల భారీ తేడాతో సెయింట్ జోసెఫ్ హైస్కూల్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ ఆండ్రూస్ 5 వికెట్లకు 239 పరుగులు చేసింది.
సంపత్ (74), సిద్ధార్థ్ (52) అర్ధ సెంచరీలతో రాణించగా... వైష్ణవ్ (47) మెరుగ్గా ఆడాడు. అన ంతరం బరిలోకి దిగిన సెయింట్ జోసెఫ్ హైస్కూల్ 108 పరుగులకే కుప్పకూలింది. ప్రత్యూష్ (53) మినహా మిగతావారు చేతులెత్తేశారు. మరో మ్యచ్‌లో మెదక్ వికెట్ తేడాతో సెయింట్ మార్క్స్ ప్రోగ్రెసివ్ హైస్కూల్‌పై గెలుపొందింది. మొదట సెయింట్ మార్క్స్ 107 పరుగుల వద్ద ఆలౌటైంది. మెదక్ బౌలర్ అజ్మతుల్లా 3 వికెట్లు పడగొట్టాడు. తర్వాత మెదక్ 9 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. సెయింట్ మార్క్స్ బౌలర్ కపిల్ వ్యాస్ 3 వికెట్లు తీసుకున్నాడు.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
కాల్ పబ్లిక్ స్కూల్: 210/3 (పి.సిద్ధార్థ్ 51, సూర్యతేజ 52, సాత్విక్ 46); కరీంనగర్: 213/5 (రిత్విక్ సూర్య 63, రోహన్ 55 నాటౌట్).
ఎ-డివిజన్ వన్డే లీగ్
ఎలిగెంట్: 182/9 (తౌసిఫ్ ఖాన్ 66, మాజిద్ 48; ధీరజ్ 4/47); కన్స్‌ల్ట్: 120 (మహీందర్ 50; అజయ్ రెడ్డి 7/46).
నిప్పులు చెరిగిన రిషబ్
Published Fri, Nov 29 2013 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 AM
Advertisement