బాస్కెట్‌బాల్ కాలేజి లీగ్
జింఖానా, న్యూస్‌లైన్: బీఎఫ్‌ఐ ఐఎంజీ రిలయన్స్ బాస్కెట్‌బాల్ కాలేజి లీగ్‌లో సెయింట్ మార్టిన్స్ జట్టు గెలుపొందింది. సికింద్రాబాద్ వైఎంసీఏలో జరుగుతున్న ఈ పోటీల్లో శుక్రవారం పురుషుల విభాగంలో జరిగిన మ్యాచ్‌లో సెయింట్ మార్టిన్స్ 41-16తో సీవీఎస్‌ఆర్ కాలేజిపై నెగ్గింది. ప్రథమార్ధం ముగిసే సమయానికి 21-9తో సెయింట్ మార్టిన్స్ జట్టు ఆధిక్యంలో నిలిచింది. ముందు నుంచి దూకుడుగా ఆడుతున్న సెయింట్ మార్టిన్స్ ఆటగాళ్లు విశాల్ (16), ప్రీతమ్ (11) చివరి వరకు అదే తీరులో కొనసాగి జట్టుకు విజయాన్ని అందించారు. సీవీఎస్‌ఆర్ జట్టులో కృష్ణ (5), ఫైజల్ (4) ఫర్వాలేదనిపించారు.
మరోైవె పు మహిళల విభాగంలో సైతం సీవీఎస్‌ఆర్ జట్టుకు పరాజయం తప్పలేదు. లయోలా అకాడమీ జట్టు 36-26తో సీవీఎస్‌ఆర్ జట్టుపై నెగ్గింది. ప్రథమార్ధంలో 18-10తో లయోలా అకాడమీ ముందంజలో ఉంది. రెండో అర్ధ భాగంలో సీవీఎస్‌ఆర్ క్రీడాకారిణి ప్రత్యూష (20) విజృంభించినప్పటికీ... లయోలా అకాడమీ ఆటగాళ్లు రమా మిశ్రా (12), అక్షిత (10), మౌనిక (6) చాకచక్యంగా వ్యవహరించడంతో జట్టుకు విజయం చేకూరింది.
సెయింట్ మార్టిన్స్ గెలుపు
Published Sat, Jan 25 2014 12:09 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM
Advertisement
Advertisement