నైనా ‘డబుల్’ ధమాకా | naina jaiswal double dhamaka | Sakshi
Sakshi News home page

నైనా ‘డబుల్’ ధమాకా

Published Sat, Nov 16 2013 12:11 AM | Last Updated on Sat, Sep 2 2017 12:38 AM

డాక్టర్ విన్సెంట్ ఫై స్మారక అంతర్ జిల్లా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి నైనా జైస్వాల్ ‘డబుల్’ సాధించింది.

 జింఖానా, న్యూస్‌లైన్: డాక్టర్ విన్సెంట్ ఫై స్మారక అంతర్ జిల్లా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి నైనా జైస్వాల్ ‘డబుల్’ సాధించింది. అనంతపురంలో శుక్రవారం ముగిసిన ఈ పోటీల్లో నైనా సబ్ జూనియర్, జూనియర్ బాలికల సింగిల్స్ విభాగాల్లో విజేతగా నిలిచింది. సబ్ జూనియర్ ఫైనల్లో నైనా 11-9, 9-11, 11-13, 11-8, 11-7, 11-7తో సైలూ నూర్ బాషా (విజయవాడ)పై... జూనియర్ ఫైనల్లో నైనా 11-9, 5-11, 9-11, 11-6, 11-3, 12-10తో ఆకుల శ్రీజపై విజయం సాధించింది.
 
 యూత్ బాలుర విభాగంలో హరికృష్ణ, యూత్ బాలికల విభాగంలో నిఖత్ బాను విజేతలుగా నిలిచారు.  ఫైనల్స్‌లో హరికృష్ణ (జీటీటీఏ) 11-8, 11-7, 11-9, 11-7తో సాయి ప్రణీత్ (వీజేఏ)పై విజయం సాధించగా... నిఖత్ బాను (జీఎస్‌ఎం) 11-6, 3-11, 8-11, 4-11, 11-6, 11-9, 13-11తో శ్రీజ (జీటీటీఏ)పై నెగ్గి టైటిల్ కైవసం చేసుకుంది. సబ్ జూనియర్ బాలుర ఫైనల్లో స్నేహిత్ (జీటీటీఏ) 11-3, 11-6, 8-11, 11-8తో పీయూష్ అగర్వాల్ (ఎస్‌పీఎస్‌టీటీఏ)పై నెగ్గి చాంపియన్‌గా నిలిచాడు.
 
 జూనియర్ బాలుర ఫైనల్స్‌లో హర్ష లాహోటి (వైఎంసీఏ) 6-11, 9-11, 8-11, 13-11, 11-3, 6-11, 12-10తో స్నేహిత్‌పై విజయం సాధించాడు. పురుషుల విభాగంలో విఘ్నయ్ రెడ్డి... మహిళల విభాగంలో ఆకుల శ్రీజ చాంపియన్స్‌గా అవతరించారు. ఫైనల్స్‌లో విఘ్నయ్ 11-5, 11-7, 10-12, 9-11, 11-6, 11-9తో సోమ్‌నాథ్ ఘోష్ (ఎస్‌సీ రైల్వే)పై... శ్రీజ 11-6, 4-11, 8-11, 11-7, 12-10, 8-11, 11-8తో సైలూ నూర్ బాషా (విజయవాడ)పై గెలిచారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement