జింఖానా, న్యూస్‌లైన్: సైబర్ చెస్ అకాడమీ నిర్వహించిన ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో రామకృష్ణ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన టోర్నీ ఫైనల్స్‌లో భరత్ కుమార్ రెడ్డి రెండో స్థానంలో నిలవగా... నాగ శశాంక్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మహిళల విభాగంలో వినీత టైటిల్ సాధించింది. నేహ రెండో స్థానాన్ని దక్కించుకుంది. జగ్‌మాంజర్ చెస్ టోర్నమెంట్ ఫైనల్స్‌లో రోహిత్ యాదవ్ టైటిల్ కైవసం చేసుకున్నాడు.
ఆర్ ఎస్ శరణ్ రెండో స్థానంలో, మేఘనాశ్రమ్ మూడో స్థానంలో నిలిచారు. అండర్-8 విభాగంలో సాయి రేవంత్ రెడ్డి అగ్రస్థానంలో నిలవగా... ప్రశాంత్ ద్వితీయ స్థానంలో నిలిచాడు. అండర్-14 విభాగంలో అభిజిత్ రెడ్డి విజేతగా నిలవగా... రెండో స్థానాన్ని సాయి రోచిష్ కైవసం చేసుకున్నాడు. అండర్-12 విభాగంలో మొదటి స్థానాన్ని అనిరుధ్, రెండో స్థానాన్ని తేజస్ సొంతం చేసుకున్నారు. అండర్-6 విభాగంలో సాయి చాణిక్య, అండర్-10 విభాగంలో శ్రీకర్ టైటిల్ గెలుచుకున్నారు.
చెస్ చాంపియన్ రామకృష్ణ
Published Sun, Jan 5 2014 11:54 PM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM
Advertisement
Advertisement