Rohit yadav
-
World Athletics Championships 2022: నేడు బరిలో నీరజ్ చోప్రా
భారత క్రీడాభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పోరుకు రంగం సిద్ధమైంది. భారత స్టార్ అథ్లెట్, టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా నేడు బరిలోకి దిగబోతున్నాడు. జావెలిన్ త్రో క్వాలిఫయింగ్ ఈవెంట్లో అతనితో పాటు మరో భారత త్రోయర్ రోహిత్ యాదవ్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటాడు. ఆటోమెటిక్ క్వాలిఫయింగ్ మార్క్ 83.50 మీటర్లు (లేదా) కనీసం టాప్–12లో నిలిస్తే ఫైనల్‌కు అర్హత లభిస్తుంది. ఉ.గం. 5.35 నుంచి సోనీ చానల్స్, సోనీ లివ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ప్రిక్వార్టర్స్‌లో రాహుల్, రోహిత్ యాదవ్
గువాహటి: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ విభాగంలో తెలంగాణకు చెందిన చిట్టబోయిన రాహుల్ యాదవ్, రోహిత్ యాదవ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌ల్లో రాహుల్ 21–12, 21–11తో డి. జశ్వంత్ (ఆంధ్రప్రదేశ్)పై... రోహిత్ 21–19, 21–19తో ప్రతుల్ జోషి (రైల్వేస్)పై విజయం సాధించారు. ఈ ఇద్దరితోపాటు లక్ష్య సేన్ (ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా), ఆలాప్ మిశ్రా (మధ్యప్రదేశ్), హర్షీల్ డాని (మహారాష్ట్ర), ఆర్యమాన్ టాండన్ (ఎయిరిండియా), కౌశల్ (మహారాష్ట్ర), సౌరభ్ వర్మ (పీఎస్‌పీబీ) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. మహిళల సింగిల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి (తెలంగాణ), గుమ్మడి వృశాలి (ఆంధ్రప్రదేశ్) నాలుగో రౌండ్లో ఓటమి చవిచూశారు. గాయత్రి 17–21, 17–21తో రియా ముఖర్జీ (రైల్వేస్) చేతిలో ఓడిపోగా... శ్రుతి ముందాడ (మహారాష్ట్ర)తో జరిగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌ను 19–21తో కోల్పోయి... రెండో గేమ్‌లో 2–10తో వెనుకబడిన దశలో వృశాలి గాయం కారణంగా వైదొలిగింది. -
చెస్ చాంపియన్ రామకృష్ణ
జింఖానా, న్యూస్‌లైన్: సైబర్ చెస్ అకాడమీ నిర్వహించిన ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో రామకృష్ణ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన టోర్నీ ఫైనల్స్‌లో భరత్ కుమార్ రెడ్డి రెండో స్థానంలో నిలవగా... నాగ శశాంక్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మహిళల విభాగంలో వినీత టైటిల్ సాధించింది. నేహ రెండో స్థానాన్ని దక్కించుకుంది. జగ్మాంజర్ చెస్ టోర్నమెంట్ ఫైనల్స్‌లో రోహిత్ యాదవ్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఆర్ ఎస్ శరణ్ రెండో స్థానంలో, మేఘనాశ్రమ్ మూడో స్థానంలో నిలిచారు. అండర్-8 విభాగంలో సాయి రేవంత్ రెడ్డి అగ్రస్థానంలో నిలవగా... ప్రశాంత్ ద్వితీయ స్థానంలో నిలిచాడు. అండర్-14 విభాగంలో అభిజిత్ రెడ్డి విజేతగా నిలవగా... రెండో స్థానాన్ని సాయి రోచిష్ కైవసం చేసుకున్నాడు. అండర్-12 విభాగంలో మొదటి స్థానాన్ని అనిరుధ్, రెండో స్థానాన్ని తేజస్ సొంతం చేసుకున్నారు. అండర్-6 విభాగంలో సాయి చాణిక్య, అండర్-10 విభాగంలో శ్రీకర్ టైటిల్ గెలుచుకున్నారు.