విజయ్ సింగ్ విజృంభణ | vijay singh took five wickets | Sakshi
Sakshi News home page

విజయ్ సింగ్ విజృంభణ

Published Sat, Dec 14 2013 12:41 AM | Last Updated on Sat, Sep 2 2017 1:34 AM

vijay singh took five wickets

జింఖానా, న్యూస్‌లైన్: వీనస్ సైబర్‌టెక్ బౌలర్ విజయ్ సింగ్ (5/66), వంశీ రెడ్డి (3/13) తమ బౌలింగ్‌తో ఎంసీసీ జట్టు బ్యాట్స్‌మెన్‌కు ముచ్చెమటలు పట్టించారు. ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో వీనస్ సైబర్‌టెక్ జట్టు 128 పరుగుల తేడాతో ఎంసీసీ జట్టుపై ఘనవిజయం సాధించింది. తొలి రోజు బ్యాటింగ్ చేసిన వీనస్ సైబర్‌టెక్ 226 పరుగులు చే సింది. రెండో రోజు బరిలోకి దిగిన ఎంసీసీ 98 పరుగులకే కుప్పకూలింది. హెచ్‌సీఏ బ్రదర్ జాన్ ఆఫ్ గాడ్ అండర్-14 నాకౌట్ టోర్నీలో ఆల్ సెయింట్స్ జట్టు బ్యాట్స్‌మెన్ మధుకుమార్ (76), అదిష్ (61) అర్ధ సెంచరీలతో రాణించారు.
 
 దీంతో ఆ జట్టు 40 పరుగుల తే డాతో గౌతమ్ మోడల్ హైస్కూల్‌పై గెలుపొందింది. మొదట ఆల్ సెయింట్స్ 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. గౌతమ్ మోడల్ హైస్కూల్ బౌలర్ జైదేవ్ 3 వికెట్లు పడగొట్టాడు. తర్వాత బరిలోకి దిగిన గౌతమ్ మోడల్ హైస్కూల్ 170 పరుగులకే ఆలౌటైంది. వరుణ్ గౌడ్ 34, రతన్ రాజ్ 32 పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. ఆల్ సెయింట్ బౌలర్ శివకుమార్ 3 వికెట్లు తీసుకున్నాడు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement