ఇండియా ఓపెన్ టీటీ
జింఖానా, న్యూస్‌లైన్: ఇండియా జూనియర్ అండ్ క్యాడెట్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ క్యాడెట్ డబుల్స్ విభాగంలో స్నేహిత్ జోడి పతకం ఖాయం చేసుకుంది. భారత్ ‘బి’ జట్టుగా బరిలోకి దిగిన స్నేహిత్, హరికృష్ణ జోడి సెమీస్‌కు చేరింది. గోవాలో గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ ‘బి’ 3-2తో భారత్ ‘సి’పై విజయం సాధించింది.
తొలి సెట్‌లో 13-15 పరాజయం పాలైన భారత్ ‘బి’ 11-8తో రెండో సెట్‌ను దక్కించుకుంది. మూడో సెట్‌లో 9-11 వెనుకబడినప్పట్టికీ మిగతా సెట్లలో 11-7, 11-8 తేడాతో నెగ్గి మ్యాచ్‌ను గెలుచుకుంది. మరోవైపు వ్యక్తిగత విభాగంలో హరికృష్ణ మెయిన్ డ్రాలోకి ప్రవేశించాడు. గ్రూప్-3లో ఆడుతున్న హరికృష్ణ తొలుత 3-0తో సిద్ధాంత్ సునీల్‌పై, రెండో మ్యాచ్‌లో 3-0తో రొసారియో వెస్లీపై నెగ్గాడు. అయితే మూడో మ్యాచ్‌లో 2-3తో స్వీడన్‌కు చెందిన కార్ల్‌సన్ ఫిలిప్ చేతిలో ఓడాడు. ప్రస్తుతం హరికృష్ణ గ్రూపులో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
స్నేహిత్‌కు పతకం ఖాయం
Published Fri, Mar 28 2014 3:23 AM | Last Updated on Sat, Sep 2 2017 5:15 AM
Advertisement
Advertisement