క్వార్టర్స్‌లో అపోలో, షాదాన్ | Apollo, shadan team reached quarter finals in foot ball tournment | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో అపోలో, షాదాన్

Published Wed, Dec 18 2013 12:35 AM | Last Updated on Sat, Sep 2 2017 1:42 AM

Apollo, shadan team reached quarter finals in foot ball tournment

జింఖానా, న్యూస్‌లైన్: మెడికల్ కాలేజిల క్రీడోత్సవాల్లో భాగంగా ఆతిథ్య అపోలో, షాదాన్ జట్లు ఫుట్‌బాల్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాయి. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ అండ్ రీసెర్చ్ (ఏఐఎంఎస్‌ఆర్)లో జరిగిన బాలుర విభాగంలో అపోలో (ఏఐఎంఎస్‌ఆర్) జట్టు 2-0 తేడాతో ఉస్మానియా జట్టును ఓడించింది. అలాగే షాదాన్ మెడికల్ కాలేజి 2-1 తేడాతో భాస్కర మెడికల్ కాలేజిపై నెగ్గింది. అలాగే డెక్కన్ కాలేజి 4-0-తో మెడిసిటీపై నెగ్గి క్వార్టర్స్ చేరింది.
 
  క్రికెట్ మ్యాచ్‌ల్లో ఉస్మానియా.. మెడిసిటీపై, గాంధీ.. మల్లారెడ్డిపై, అపోలో.. కామినేనిపై, భాస్కర.. డెక్కన్‌పై నెగ్గాయి. బాలికల బాస్కెట్‌బాల్ మ్యాచ్‌లోనూ అపోలో జట్టు గాంధీ జట్టుపై విజేతగా నిలిచింది. 19 వరకు జరిగే ఈ పోటీల్లో వాలీబాల్, బాస్కెట్‌బాల్, త్రోబాల్, చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ విభాగాల్లో పోటీలు జరుగనున్నాయి. రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడుల శాఖ కార్యదర్శి కృష్ణ బాబు పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎంఎస్‌ఆర్ కోశాధికారి ఏపీవీ రెడ్డి, డాక్టర్ దిలీప్  తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement