జగన్నాథ్‌కు 8 వికెట్లు | jaganadh took 8 wickets | Sakshi
Sakshi News home page

జగన్నాథ్‌కు 8 వికెట్లు

Published Sun, Dec 15 2013 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM

jaganadh took 8 wickets

జింఖానా, న్యూస్‌లైన్: విద్యుత్ సౌధ బౌలర్ జగన్నాథ్ (8/20) తన బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. దీంతో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో వీఎస్‌టీ జట్టుపై విజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన వీఎస్‌టీ... జగన్నాథ్ బౌలింగ్‌కు 50 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విద్యుత్ సౌధ రెండే వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. మరో మ్యాచ్‌లో ఎంసీహెచ్  163 పరుగుల భారీ తేడాతో నేషనల్ జట్టుపై గెలుపొందింది.
 
 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
 హెచ్‌జీసీ: 156 (సాయి చరణ్ 46; సందేశ్ 5/18); వాకర్ టౌన్: 156/6 (ప్రశాంత్ 70, తేజొ 31; చరణ్ 4/51)  సెయింట్ సాయి: 176/9 (జితేందర్ 58; సుధాకర్ 3/46, అభినయ్ 4/28); విజయ్ సీసీ: 169/9 (సుధాకర్ 50; మార్షల్ 5/24).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement