జింఖానా, న్యూస్‌లైన్: బీఎఫ్‌ఐ ఐఎంజీ రిలయన్స్ స్కూల్ బాస్కెట్‌బాల్ లీగ్‌లో గీతాంజలి స్కూల్ జట్టు ఫైనల్‌కు చేరింది. వైఎంసీఏలో గురువారం జరిగిన సెమీఫైనల్స్‌లో గీతాంజలి 50-41తో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌పై విజయం సాధించింది. మ్యాచ్ తొలి అర్ధ భాగం ముగిసే సమయానికి 21-15తో గీతాంజలి జట్టు ఆధిక్యంలో నిలిచింది.
అనంతరం ప్రత్యర్థి నుంచి కొంత పోటీ ఎదురైనప్పటికీ భార్గవ్ (23), ఒమర్ (14), సహర్ష్ (9) చాకచక్యంగా వ్యవహరించడంతో జట్టుకు విజయం చేకూరింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ జట్టులో ప్రతీక్ (11), సుమిరన్ (10), అత్రేయ (8) రాణించారు. మరో మ్యాచ్‌లో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ 52-38తో చిరెక్ పబ్లిక్ స్కూల్‌పై గెలుపు దక్కించుకుంది.
బాలికల విభాగం ఫలితాలు: చిరెక్ పబ్లిక్ స్కూల్: 52 (సన్హిత 16, నటాషా 14, సబ్రీన్ 10, దృష్టి 5); ఢిల్లీ పబ్లిక్ స్కూల్: 42 (శ్రీత 15, నేహ 11, యోగిత 11).
సెయింట్ పాయిస్ హైస్కూల్: 33 (మౌనిక 12, పూజ నాయుడు 13, తేజస్విని 4); ఫ్యూచర్ కిడ్స్: 32 (మేఘన 12, హారిక 10, ప్రణవి 8).
ఫైనల్స్‌లో గీతాంజలి స్కూల్
Published Fri, Dec 20 2013 12:09 AM | Last Updated on Sat, Sep 2 2017 1:46 AM
Advertisement
Advertisement