కివీస్ శుభారంభం | All-round Browne stars in narrow NZ Women win | Sakshi
Sakshi News home page

కివీస్ శుభారంభం

Published Mon, Mar 24 2014 1:57 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM

All-round Browne stars in narrow NZ Women win

 టి20 మహిళల ప్రపంచ కప్
 సిల్హెట్: టి20 మహిళల ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టు బోణీ చేసింది. సోమవారం సిల్హెట్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన గ్రూప్ ‘ఎ’ తొలి మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో నెగ్గింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ మహిళల జట్టు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 128 పరుగులు చేసింది. పెర్కిన్స్ (36 బంతుల్లో 31; 3 ఫోర్లు), బ్రోన్ (19 బంతుల్లో 29; 3 ఫోర్లు; 1 సిక్స్) ఆకట్టుకున్నారు.
 
 ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 19.3 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ అలిస్సా హీలీ (41 బంతుల్లో 41; 4 ఫోర్లు)తో పాటు బ్లాక్‌వెల్ (28 బంతుల్లో 31; 3 ఫోర్లు) రాణించారు. గ్రూప్ ‘ఎ’ రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 44 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. సోమవారం జరిగే మ్యాచ్‌లో మిథాలీ రాజ్ నాయకత్వంలోని భారత జట్టు శ్రీలంకను ఢీకొంటుంది.  ఈ ఏడాది ఆరంభంలో లంకతో జరిగిన వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసినప్పటికీ టి20 మ్యాచ్‌ల్లో మాత్రం 1-2తో సిరీస్ ఓడింది. నేటి మ్యాచ్‌లో ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement