టీ20 క్రికెట్‌లో భారత మహిళల జట్టు హర్మన్‌ప్రీత్ కౌర్ సరి కొత్త చరిత్ర సృష్టించింది. 150 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ప్లేయర్‌గా హర్మన్‌ప్రీత్ రికార్డులకెక్కింది. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఐర్లాండ్‌తో తలపడేందుకు మైదానంలో అడుగుపెట్టిన హర్మన్.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు పురుషుల, మహిళల క్రికెట్‌లో మరెవరెకీ ఈ రికార్డు సాధ్యం కాలేదు.
అంతకుముందు అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ(148) రికార్డును కూడా హర్మన్ బ్రేక్ చేసింది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఫిబ్రవరి 18(శనివారం) ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్మన్ ఈ ఘనత సాధించింది.
ఇక మహిళల క్రికెట్ లో హర్మన్ తర్వాత న్యూజిలాండ్ క్రికెటర్ సుజీ బేట్స్ 143 మ్యాచ్‌లతో రెండోస్థానంలో ఉంది. ఆమె తర్వాతి స్థానంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధానా 115 మ్యాచ్‌లతో ఉంది. అదేవ విధంగా టీ20లలో రోహిత్, విరాట్ కోహ్లిల తర్వాత 3 వేల పరుగులు చేసిన మూడో భారత క్రికెటర్‌గా హర్మన్‌ప్రీత్ నిలిచింది. ఇక ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో కేవలం ఆమె 13 పరుగులు చేసింది.
సెమీస్‌లో భారత్
ఇక ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై విజయం సాధించిన భారత్..సెమీస్‌కు అర్హత సాధించింది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 5 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.అయితే ఐర్లాండ్ ఇన్నింగ్స్ 54/2 వద్ద మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఈ నేపథ్యంలో వర్షం ఎప్పటికీ తగ్గుముఖం పట్టే సూచనలు కన్పించకపోవడంతో.. డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో భారత్‌ను విజేతగా నిర్ణయించారు.
చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో మూడో టెస్టు.. టీమిండియా వైస్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
🚨 Milestone Alert 🚨
— BCCI Women (@BCCIWomen) February 20, 2023
First woman cricketer to play 1⃣5⃣0⃣ T20Is 🙌 🔝
Congratulations to #TeamIndia captain @ImHarmanpreet on a special landmark 👏 👏#INDvIRE | #T20WorldCup pic.twitter.com/X1DyIqhlZI
Comments
Please login to add a commentAdd a comment