మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్-బిలో ఇవాళ చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. పురుషుల క్రికెట్ లాగే మహిళల క్రికెట్‌లోనూ దాయాదుల సమరం కేవలం మెగాటోర్నీల వరకే పరిమితమైంది. అందుకే భారత్, పాక్ మ్యాచ్ అంటే ఎప్పుడైనా క్రేజ్ అలాగే ఉంటుంది. ఇక టీమిండియా వుమెన్స్‌కు రెండు వార్మప్ మ్యాచ్‌లతో మంచి ప్రాక్టీస్ లభించినట్లయింది.
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో ఓడిన భారత్.. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో మాత్రం 52 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది. మరోవైపు పాకిస్తాన్ కూడా తాను ఆడిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో ఒకదాంట్లో గెలిచి మరొకటి ఓడిపోయింది. బంగ్లాదేశ్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన పాకిస్తాన్.. సౌతాఫ్రికాతో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో మాత్రం ఓటమిపాలైంది.
పాక్‌తో పోరుకు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన వేలిగాయంతో దూరమవడం టీమిండియాను కలవరపెడుతోంది. అయితే స్మృతి మంధాన దూరమైనప్పటికి బ్యాటింగ్ విభాగం పటిష్టంగానే కనిపిస్తుండడం సానుకూలాంశం. ఈ నేపథ్యంలో పాక్‌తో మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్ ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. ఓపెనర్లుగా యస్తికా బాటియా, షఫాలీ వర్మలు ఖాయం.
వన్‌డౌన్‌లో జెమిమా రోడ్రిగ్స్, నాలుగో స్థానంలో హర్లిన్ డియోల్‌లు రానున్నారు. ఐదో స్థానంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. ఆరో స్థానంలో రిచా ఘోష్ రానుంది. ఇక ఆల్‌రౌండర్లుగా పూజా వస్త్రాకర్, దీప్తి శర్మలు ఉన్నారు. రేణుకా సింగ్, రాధా యాదవ్, శిఖా పాండేలు పేస్ బౌలింగ్ మారాన్ని మోయనున్నారు.
టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్: హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), యస్తికా బాటియా, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్లిన్ డియోల్, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ, రేణుకా సింగ్, రాధా యాదవ్, శిఖా పాండే
Comments
Please login to add a commentAdd a comment