
PC: IPL Twitter
రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు జాస్ బట్లర్ కొద్దిలో గాయం నుంచి తప్పించుకున్నాడు.ఐపీఎల్ 2022లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్ 6వ ఓవర్ రిలే మెరిడిత్ వేశాడు ఓవర్ ఐదో బంతిని మెరిడిత్ షార్ట్ బౌన్సర్ వేశాడు. బట్లర్ పుల్‌షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి వేగంగా వచ్చి హెల్మెట్‌ను బలంగా తాకింది.దీంతో ఆటకు కాసేపు అంతరాయం కలిగింది.
స్లోమోషన్ రిప్లేలో బంతి బట్లర్ హెల్మెట్ గ్రిల్స్‌కు తాకినట్లు కనిపించింది. బంతి వేగానికి బట్లర్ తల అదిమినట్లయింది. ఫిజియో వచ్చి పరీశీలించగా.. బట్లర్ తాను బానే ఉన్నట్లు పేర్కొన్నాడు. దీంతో రాజస్తాన్ ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. ఇది చూసిన అభిమానులు అదృష్టం బాగుండి బట్లర్ బతికిపోయాడు అంటూ కామెంట్స్ చేశారు.
చదవండి: IPL 2022: జడేజా సంచలన నిర్ణయం.. సీఎస్‌కే కొత్త కెప్టెన్ ఎవరంటే?
#RileyMeredith bouncer hits #JosButtler on helmet pic.twitter.com/fUpk9ZvUPp
— Raj (@Raj93465898) April 30, 2022