IPL 2023, GT Vs RR: బట్లర్‌ మనసు దోచిన గుజరాత్‌ చిన్నది.. | A Lucky Fan Met Jos Buttler Before The GT Vs RR Match, Video Viral - Sakshi
Sakshi News home page

#JosButtler: బట్లర్‌ మనసు దోచిన గుజరాత్‌ చిన్నది..

Published Sun, Apr 16 2023 11:24 PM | Last Updated on Mon, Apr 17 2023 8:46 AM

Jos Buttler Met His Lucky Fan Intresting Conversation Viral GT Vs RR - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఆదివారం గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ను గుజరాత్‌ తమ హోంగ్రౌండ్‌ నరేంద్ర మోదీ స్టేడియంలో ఆడింది. సొంత మైదానంలో తమ జట్టు మ్యాచ్‌ ఆడుతుందంటే స్టేడియంలోకి వచ్చే ప్రేక్షకుల మద్దతు మొత్తం సదరు జట్టుకే ఉంటుంది. అయితే ఒక గుజరాత్‌ చిన్నది మాత్రం రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ జాస్‌ బట్లర్‌ మనసును దోచేసింది.

విషయంలోకి వెళితే.. గుజరాత్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌కు ఒకరోజు ముందు(అంటే శనివారం) నెట్‌ ప్రాక్టీస్‌ సెషన్‌ జరిగింది. ప్రాక్టీస్‌లో ఇరుజట్లు పాల్గొన్నాయి. బట్లర్‌ తన ప్రాక్టీస్‌ ముగించుకొని వెళ్తున్న సమయంలో ఒక యువతి బట్లర్‌ వద్దకు వచ్చింది. బట్లర్‌తో మాట్లాడుతూ.. ''నేను మీకు వీరాభిమానిని.. మీ ఆటంటే నాకు చాలా ఇష్టం.. ఐ లవ్‌ యూ'' అంటూ పేర్కొంది. ఆమె మాటలకు ముగ్దుడైన బట్లర్‌ యువతితో మాట్లాడాడు.

''ఐపీఎల్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారా అని అడగ్గా.. ''సూపర్‌గా ఎంజాయ్‌ చేస్తున్నా.. నాది గుజరాత్‌ అయినప్పటికి మీకు పెద్ద ఫ్యాన్‌ను. మీకోసమే రేపటి(ఆదివారం) మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు మద్దతు ఇవ్వబోతున్నా'' అని పేర్కొంది. దీనికి బట్లర్‌.. ''అంటే రేపు మ్యాచ్‌లో పింక్‌ డ్రెస్‌ వేసుకోబోయేది నువ్వొక్కదానివే అనుకుంటా అని నవ్వుతూ పేర్కొన్నాడు.

ఆ తర్వాత బట్లర్‌ ఆటోగ్రాఫ్‌ తీసుకున్న సదరు యువతి బట్లర్‌తో సెల్ఫీ దిగింది. కాగా దీనికి సంబంధించిన వీడియోనూ రాజస్తాన్‌ రాయల్స్‌ ట్విటర్‌లో షేర్‌ చేసుకుంది. ప్రస్తుతం బట్లర్‌ మనసు దోచిన గుజరాత్‌ యువతి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: ఎవరికి చిక్కని బట్లర్‌.. ఏడేళ్లలో రెండోసారి మాత్రమే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement