ఇటీవలే ఆంటోనీ చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించిన కోలీవుడ్ భామ కల్యాణి ప్రియదర్శన్. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇంతకు ముందు ఎప్పుడు కనిపించని కిక్ బాక్సర్ పాత్రలో మెప్పించింది. ఇప్పటి వరకు తాను నటించిన సినిమాలన్నింటిలో తనదైన నటనతో ఆకట్టుకుంది. జోషి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జోజు జార్జ్ హీరోగా నటించారు.
దర్శకుడు ప్రియదర్శన్ కూతురిగా ఎంట్రీ ఇచ్చిన కల్యాణి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మలయాళంలోనే కాకుండా సౌత్ ఇండియాలో క్రేజీ హీరోయిన్‌గా రాణిస్తోంది. తాజాగా తాను నటించిన ఆంటోనీ చిత్రం గురించి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ మూవీ కోసం చాలా కష్టపడినట్లు తెలిపింది. ఇంతకీ ఆ వివరాలేంటో తెలుసుకుందాం
కల్యాణి తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'కంఫర్ట్ జోన్‌లో గ్రోత్ లేదు. గ్రోత్ జోన్‌లో కంఫర్ట్ లేదు. నేను ఈ విషయాన్ని కాస్తా ఆలస్యంగా తెలుసుకున్నా. కానీ ఆ పంచ్‌లు, కిక్‌లు, గాయాలు, కన్నీళ్లు, చిరునవ్వులు మాత్రమే నిజమయ్యాయి. కానీ ఆ రక్తం మాత్రం నిజం కాదు. మీ ప్రశంసలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ కేరింతలకు ధన్యవాదాలు. అన్నింటికంటే మించి నాపై, నా సినిమాపై ప్రేమ చూపినందుకు ప్రతి ఒక్కరికీ థ్యాంక్ యూ అంటూ పోస్ట్ చేసింది.
అయితే ఇంతకుముందే ఓ ఇంటర్వ్యూలో షూటింగ్ సమయంలో గాయపడినట్లు కల్యాణి తెలిపింది. మూడు వారాలపాటు ప్రతిరోజూ దాదాపు నాలుగు గంటలు కిక్ బాక్సింగ్ శిక్షణ ఉండేదని వివరించింది. అందుకోసం చాలా శిక్షణ కష్టపడ్డానని.. గాయాల కారణంగా రెండు రోజులు షూటింగ్ నుంచి విరామం తీసుకోవలసి వచ్చిందని వెల్లడించింది. అందుకే ఇతర నటీనటులకు కూడా డేట్స్ విషయంలో ప్రాబ్లమ్స్ వచ్చాయని కల్యాణి తెలిపింది. కాగా.. ఆంటోనీ చిత్రంల నైల ఉష, చెంబన్ వినోద్, ఆశా శరత్, విజయరాఘవన్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం కల్యాణి ఫాతిమా ఆన్ మైక్ అనే చిత్రంలో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment