సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ డైరెక్టర్, నిర్మాత ఆంథోని ఈస్ట్‌మన్(75) గుండెపోటుతో కన్నుమూశారు. శనివారం ఆయనకు గుండెపోటు రావడవంతో కుటుంబ సభ్యులు త్రిస్పూర్‌లోని మెడికల్ కాలేజీకి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతు ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన మృతికి మలయాళ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఫొటోగ్రాఫర్‌గా కెరీర్ స్టార్ చేసిన ఆంథోని ఈస్టమన్ అనే స్టూడియో ప్రారంభించారు. ‘ఇనాయే తేడి’ అనే చిత్రంతో ఆయన దర్శకుడిగా మారారు. ఈ మూవీ తర్వాత అంబాడే న్జానే, ఐస్ క్రీమ్, వయల్ వంటి చిత్రాలను తెరకెక్కించి హిట్ అందుకున్నారు. ఇక సీనియర్ నటి సిల్క్ స్మితను వెండితెరకు పరిచయం చేసింది కూడా ఈయనే.
గతంలో ఆయన ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ సిల్క్ స్మితను వెండితెరకు ఎలా పరియం చేశారో వివరించారు. ‘హీరోయిన్ కోసం వెతుకుతున్న క్రమంలో కొద్ది రోజులకు కోడంబక్కంలోని కొందరూ యువతులు మేకప్ వేసుకోని ఆడిషన్స్ ఇస్తున్నారు. అక్కడే ఓ యువతి పనిమనిషిలా కుర్చోని ఉంది. ఆమెను ఫొటో తీసుకోవచ్చా అని ఆమె అమ్మ దగ్గరి అనుమతి తీసుకుని ఆ యువతిని మేకప్ లేకుండా ఫొటోలు తీసుకున్నాను. ఆ ఫొటోలను కొందరు డైరెక్టర్స్‌కు చూపించాను. అందరూ ఆమెను హీరోయిన్‌గా తీసుకునేందుకు ఆసక్తి చూపించారు.
దీంతో ఆమెను సంప్రదించాం. ఆమె కూడా సినిమాలకు ఒకే చెప్పింది. అయితే తన పేరు మారుస్తామని చెప్పడంతో ఆమెకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. అలా సిల్క్ మూవీకి ఆమెను హీరోయిన్‌గా తీసుకున్నాం. అయితే అప్పట్లో స్మిత పాటిల్ పాపులర్‌గా నటిగా ఉన్న సమయం అది. అందుకే ఆమెకు స్మిత అని పేరు పెట్టాం. చివరకు తన తొలి చిత్రం సిల్క్‌తో కలిపి సిల్క్ స్మిత విజయమాల మారిపోయింది’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment