అమెరికా నుంచి 555 మంది... | It's official: U.S. sending 555 athletes to Rio Olympics | Sakshi
Sakshi News home page

అమెరికా నుంచి 555 మంది...

Published Mon, Jul 25 2016 1:04 PM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM

అమెరికా నుంచి 555 మంది... - Sakshi

అమెరికా నుంచి 555 మంది...

ఒలింపిక్స్‌కు రికార్డు స్థాయిలో జంబో బృందం    
మహిళలే ఎక్కువ

 
లాస్ ఏంజెల్స్: రియో డి జనీరోలో జరిగే ఒలింపిక్స్‌కు అమెరికా దేశం 555 మందితో కూడిన భారీ బృందాన్ని పంపించనుంది. ఇది చైనా (416)కన్నా ఎక్కువ కావడం విశేషం. మరోవైపు అమెరికా బృందంలో 263 మంది పురుషులుంటే 292 మంది మహిళా అథ్లెట్లు ఉన్నారు. గత లండన్ ఒలింపిక్స్‌లోనూ యూఎస్.. మహిళలనే ఎక్కువగా పంపింది.

ఓవరాల్‌గా ఇందులో 68 మంది స్వర్ణపతక విజేతలుండగా.. 191 మంది ఒలింపియన్స్ ఉన్నారు. 306 పతక ఈవెంట్స్‌లో అమెరికా 27 విభాగాల్లో 244 పతకాల కోసం బరిలోకి దిగబోతోంది. మైకేల్ ఫెల్ప్స్ (స్విమ్మింగ్), అలిసన్ ఫెలిక్స్ (ట్రాక్ అండ్ ఫీల్డ్), సెరెనా సిస్టర్స్ (టెన్నిస్) తదితర ప్రముఖ ఆటగాళ్లు ఈ జాబితాలో ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement